Sheena Bora case: షీనా బోరా బతికే ఉందా..? ఇంద్రాణి ముఖర్జీ చెబుతున్న వాదనలో వాస్తవమెంత..
Sheena Bora Murder case: షీనా బోరా బతికే ఉందా..? ఇంద్రాణి ముఖర్జీ చెబుతున్న వాదనలో వాస్తవమెంత..? అన్న అంశంపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
Sheena Bora Murder case: షీనా బోరా బతికే ఉందా..? ఇంద్రాణి ముఖర్జీ చెబుతున్న వాదనలో వాస్తవమెంత..? అన్న అంశంపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ను స్వీకరించిన కోర్టు..తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. ప్రస్తుతం ముంబై బైకుల్లా జైల్లో ఉన్న ఇంద్రాణి.. తన కూతురు షీనాబోరా బతికే ఉందంటూ కోర్టులో పిటిషన్ వేశారు. తోటి ఖైదీ కశ్మీర్‌లో తాను షీనా (Sheena Bora) తో మాట్లాడినట్లు చెప్పారని.. షీనాబోరా బతికే ఉన్నదన్న అంశంపై దర్యాప్తు జరిపించాలని ఆమె కోరారు. ఇంద్రాణి ముఖర్జియా (Indrani Mukerjea) పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం..ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేసు దర్యాప్తు చేసిన సీబీఐని ఆదేశించింది. దీంతో ఇవాళ కౌంటర్ దాఖలు చేశారు సీబీఐ అధికారులు.
మరోవైపు ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. దీనిపై స్పందించాలని (Supreme Court) సీబీఐకి నోటీసులు జారీ చేసింది. 2015లో తన కూతురు షీనాబోరాను హత్య చేశారన్న ఆరోపణలతో అరెస్టయ్యారు ఇంద్రాణి ముఖర్జీ..ఈ కేసులో దాదాపు ఆరేళ్లుగా విచారణ జరుగుతోంది. తల్లి ఇంద్రాణి ముఖర్జియే షీనాబోరాను హత్య చేసినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇంద్రాణితో పాటు ఆమె రెండో భర్త సంజయ్ ఖన్నా, మూడో భర్త పీటర్ ముఖర్జియాతో పాటు ఇంద్రాణి డ్రైవర్ అరెస్టయ్యారు. పీటర్ ముఖర్జియా బెయిలుపై బయటకు వెళ్లి ఇంద్రాణికి డైవర్స్ ఇచ్చాడు. ఇంద్రాణికి మిగతా నిందితులకు మాత్రం ఇప్పటికీ బెయిల్ రాలేదు.
Also Read: