AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కారు బానట్‌లోంచి అదేపనిగా శబ్దాలు.. ఏంటని ఓపెన్ చేయగా.. వామ్మో..

ముంబై నగరంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బయటికి వెళ్దామని కారు దగ్గరకు వెళ్లిన ఓ మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. కారు బానెట్‌ నుంచి ఏవో శబ్దాలు రావడంతో ఏంటో అని చూడగా అక్కడ ఓ భారీ కొండచిలువ కనిపించింది. దీంతో భయపడిపోయిన ఆమె స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కొండచిలువను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: కారు బానట్‌లోంచి అదేపనిగా శబ్దాలు.. ఏంటని ఓపెన్ చేయగా.. వామ్మో..
A 7foot Python Was Found Inside A Car
Anand T
|

Updated on: Sep 08, 2026 | 10:36 AM

Share

పార్క్‌ చేసిన కారు తీసేందుకు వెళ్లిన ఓ మహిళకు అందులో సుమారు ఏడు అడుగుల పొడవున్న ఓ భారీ కొండచిలువ కనిపించిన ఘటన ముంబై నగరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. దహిసర్‌ పశ్చిమలోని కందర్పాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న సన్నీ కాంబ్లే అనే వ్యక్తి పక్కనే ఉన్న ఓ చెట్టు కింద తన కారును పార్క్ చేసి ఉంచాడు. అయితే ఇటీవల తన సోదరి కారులో బయటకెళ్దామని కారు తీసేందుకు వెళ్లింది. అయితే కారు బానెట్‌ దగ్గర నుంచి ఆమెకు ఏవో శబ్దాలు రావడంతో ఏంటా అని చూసింది. అంతే అక్కడ సుమారు ఏడు అడుగుల పొడవున్న ఓ భారీ కొండచిలువ కనిపించింది.

దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన ఆమె గట్టిగా కేకలు వేసింది. ఆ అరుపులు విని వెంటనే అక్కడికి చేరుకున్న ఆమె సోదరుడు.. వెంటనే స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చాడు. ఈ విషయం అప్పటికే కాలనీ వాసులకు తెలియడంతో ఆ కొండచిలువను చూసేందుకు అందరూ అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ కొండచిలువ పూర్తిగా కారు బానెట్‌లోకి వెళ్లడంతో.. అక్కడికెలా వెళ్లిందబ్బా అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్‌ దాదాపు అరగంట పాటు శ్రమించి బానెట్‌లో దాగి ఉన్న ఆ భారీ కొండచిలువను జాగ్రత్తగా బయటకు తీశాడు.

అయితే కారు ఇంజిన్‌ హీట్ కారణంగా కొండచిలువకు ఏమైనా గాయాలు అయ్యాయా? అని వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్షించారు అధికారులు. కానీ దానికి ఎలాంటి గాయాలు కాలేదని.. అది సురక్షితంగా ఉందని తెలియడంతో దాన్ని ఓ సంచిలో బంధించి అక్కడి నుంచి తరలించారు. తర్వాత సమీపంలో ఉన్న ఓ జూపార్క్‌లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆ కొండచిలువను వదిలిపెట్టారు. దీంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో అధికారులు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. మీకు ఎక్కడైనా పాములు, లేదా ఇతర జంతువులు కనిపిస్తే వాటిపై దాడి చేయవద్దని.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. వన్యప్రాణులను రక్షించడం మన అందరి బాధ్యత అని.. వాటి పట్ల క్రూరంగా ప్రవర్తించడం సరికాదని అన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కారు బానట్‌లోంచి అదేపనిగా శబ్దాలు.. ఏంటని ఓపెన్ చేయగా.. వామ్మో..
కారు బానట్‌లోంచి అదేపనిగా శబ్దాలు.. ఏంటని ఓపెన్ చేయగా.. వామ్మో..
ఫ్లైట్‌లో ఎన్ని లీటర్ల మద్యం తీసుకెళ్లొచ్చు..? ఈ తప్పులు చేస్తే..
ఫ్లైట్‌లో ఎన్ని లీటర్ల మద్యం తీసుకెళ్లొచ్చు..? ఈ తప్పులు చేస్తే..
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. తాతా మధు వ్యాఖ్యలపై కీలక చర్చ..
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. తాతా మధు వ్యాఖ్యలపై కీలక చర్చ..
రెండు రోజులు ఇది పూస్తే .. చేతి, కాలి గోళ్ల ఫంగస్‎ మటుమాయం
రెండు రోజులు ఇది పూస్తే .. చేతి, కాలి గోళ్ల ఫంగస్‎ మటుమాయం
వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక
వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక
ISROలో ప్రైవేటీకరణ కలకలం.. కులశేఖరపట్నం లాంచ్ సెంటర్‌పై వ్యతిరేకత
ISROలో ప్రైవేటీకరణ కలకలం.. కులశేఖరపట్నం లాంచ్ సెంటర్‌పై వ్యతిరేకత
సచిన్, కోహ్లీ రికార్డులకు ఎసరు పెడుతున్న యంగ్ స్టార్
సచిన్, కోహ్లీ రికార్డులకు ఎసరు పెడుతున్న యంగ్ స్టార్
యూట్యూబర్ నందన అరెస్ట్ కేసులో బిగ్‌ అప్‌డేట్!
యూట్యూబర్ నందన అరెస్ట్ కేసులో బిగ్‌ అప్‌డేట్!
NEET UG 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో MBBS సీట్లు పెరిగాయ్..
NEET UG 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో MBBS సీట్లు పెరిగాయ్..
ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్‌పై బిగ్ అప్‌డేట్.. చరిత్రలోనే యాపిల్..
ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్‌పై బిగ్ అప్‌డేట్.. చరిత్రలోనే యాపిల్..