స‌రి – బేసి విధానంలో స్కూళ్ల‌కు అనుమ‌తి !

స‌రి - బేసి విధానంలో స్కూళ్ల‌కు అనుమ‌తి !

ఇప్పట్లో కరోనా వైరస్ మనల్ని వదిలిపోయే అవకాశం లేదని, పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ వచ్చేంత వరకు కరోనా వైరస్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని

Jyothi Gadda

|

May 09, 2020 | 5:08 PM

ఇప్పట్లో కరోనా వైరస్ మనల్ని వదిలిపోయే అవకాశం లేదని, పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ వచ్చేంత వరకు కరోనా వైరస్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని ఇప్ప‌టికే రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, దేశాధినేత‌లు, ఆఖ‌రుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీక‌రించే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో చేసేది లేక క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేలా జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటునే ప‌లు ర‌కాల స‌డ‌లింపులు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు. అందులో భాగంగా ఇప్పుడు పాఠ‌శాల‌ల పునఃప్రారంభంపై కూడా ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణతో కూడిన ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తున్నాయి.
ఈ యేడు విద్య సంవ‌త్స‌రం అర్ధాంత‌రంగా ఆగిపోయింది. జూన్‌లో తిరిగి పాఠ‌శాల‌లు తెరిచేందుకు కావాల్సిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్రం అన్వేషిస్తోంది. అందుకోసం స్కూళ్ల‌లోనూ స‌రి – బేసి విధానం అమ‌లు చేయాల‌ని కేంద్ర మాన‌వ‌వ‌న‌రుల శాఖ భావిస్తోంది. క‌రోనా ఇప్ప‌ట్లో త‌గ్గే ఛాన్స్ లేక‌పోవ‌డంతో స్కూల్‌లోని మొత్తం విద్యార్థుల్లో కేవ‌లం 50 శాంత మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యేలా ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఓ స్కూల్లో 1 -10 వ‌ర‌కు ఉంటే ఒక రోజు స‌గం క్లాసుల స్టూడెంట్స్, మ‌రో రోజు మిగ‌తా స‌గం క్లాసుల విద్యార్థులు వ‌చ్చేలా ఆలోచ‌న‌లు చేస్తున్నారు. దీంతో పిల్ల‌ల మ‌ధ్య భౌతిక దూరం పాటించే అవ‌కాశం ఉంటుంద‌ని అధికారులు భావిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu