తలైవా ‘బాలీవుడ్ సూపర్ స్టార్’ అట! ‘బేర్’మన్న బేర్ గ్రిల్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ ని ‘ మ్యాన్ వర్సెస్ వైల్డ్ లైఫ్ ‘ షో ‘సూత్రధారి’ బేర్ గ్రిల్స్ ‘బాలీవుడ్ సూపర్ స్టార్’ అంటూ పొరబాటున ట్వీట్ చేసి సరదా అయిన సంచలనం రేపారు. కర్నాటక లోని బందిపోరా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ షో షూటింగ్ కోసం రజినీ.. మూడు రోజులపాటు బేర్ గ్రిల్స్ తో కలిసి పాల్గొన్నారు. (ఈ షూటింగ్ లో ఆయన స్వల్పంగా గాయపడ్డారు). కాగా-ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ […]

  • Umakanth Rao
  • Publish Date - 2:41 pm, Wed, 29 January 20
తలైవా 'బాలీవుడ్ సూపర్ స్టార్' అట! 'బేర్'మన్న బేర్ గ్రిల్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ ని ‘ మ్యాన్ వర్సెస్ వైల్డ్ లైఫ్ ‘ షో ‘సూత్రధారి’ బేర్ గ్రిల్స్ ‘బాలీవుడ్ సూపర్ స్టార్’ అంటూ పొరబాటున ట్వీట్ చేసి సరదా అయిన సంచలనం రేపారు.

కర్నాటక లోని బందిపోరా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ షో షూటింగ్ కోసం రజినీ.. మూడు రోజులపాటు బేర్ గ్రిల్స్ తో కలిసి పాల్గొన్నారు. (ఈ షూటింగ్ లో ఆయన స్వల్పంగా గాయపడ్డారు). కాగా-ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ షో టీవీ చరిత్రలోనే 3.6 బిలియన్ల ఇంప్రెషన్లతో రికార్డు సృష్టించిందని ట్వీట్ చేసిన గ్రిల్స్.. ‘బాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జాయిన్స్ మీ నెక్స్ట్’ అంటూ దాన్ని కంటిన్యూ చేశారు. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ అన్న పదంపై అనేకమంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో..బేర్ గ్రిల్స్ వెంటనే ఆ పదాన్ని డిలీట్ చేసి.. ‘సూపర్ స్టార్’ అని ఆ తరువాత కొత్తగా ట్వీటించారు.

ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు.. గ్రిల్స్ తొలి ఒరిజినల్ ట్వీట్ ని ట్విటర్ యూజర్లు కొందరు స్క్రీన్ షాట్లు తీసి చూపారు. అలా చూపుతూనే.. ‘రజినీకాంత్ కోలీవుడ్ సూపర్ స్టార్’ అని పేర్కొన్నారు. అసలు ఆయన కేవలం బాలీవుడ్ కే కాదని,  మొత్తం ఇండియాకే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని తలైవా వీర విధేయుల్లో ఒకరు ట్వీట్ చేశారు.