కలవరపెడుతున్న కరోనా.. చైనా నుంచి భారత్‌కు విద్యార్థులు!
CoronaVirus Out Break: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ఇప్పుడు ప్రపంచమంతా వణుకుతోంది. ఇప్పటికే చైనాలో ఈ వ్యాధి 2744 మందికి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. అటు 100 మంది చనిపోగా.. 461 మంది చావుబతుకుల మధ్య ఉన్నారు. ఇక వైరస్ తీవ్రత కారణంగా చైనా ఆర్ధిక శాఖ ఏకంగా 9 బిలియన్ డాలర్లను ప్రకటించి ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి సిద్ధమైంది. ఇకపోతే ఈ వ్యాధి చైనా నుంచి ఇండియాకు కూడా పాకిపోయిందన్న వార్తలు ప్రజల్లో […]

CoronaVirus Out Break: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ఇప్పుడు ప్రపంచమంతా వణుకుతోంది. ఇప్పటికే చైనాలో ఈ వ్యాధి 2744 మందికి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. అటు 100 మంది చనిపోగా.. 461 మంది చావుబతుకుల మధ్య ఉన్నారు. ఇక వైరస్ తీవ్రత కారణంగా చైనా ఆర్ధిక శాఖ ఏకంగా 9 బిలియన్ డాలర్లను ప్రకటించి ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి సిద్ధమైంది.
ఇకపోతే ఈ వ్యాధి చైనా నుంచి ఇండియాకు కూడా పాకిపోయిందన్న వార్తలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. చైనా నుంచి వచ్చిన వారి ద్వారా ఇది వ్యాపిస్తోందని తేలడంతో భారత ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. అన్ని విమానాశ్రయాల్లోనూ తగిన ఏర్పాట్లను చేసింది. చైనా, హొంగ్‌కాంగ్ నుంచి వచ్చిన ప్రయాణీకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు మన దేశంలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి పాజిటివ్ కేసు కూడా కనబడలేదని ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు.
ఇదిలా ఉంటే చైనాలోని వుహాన్‌లో హుబి యూనివర్సిటీలో చిక్కుకున్న భారత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్లు తెలుస్తోంది. సరైన ఆహారం, నీళ్లు లేక అవస్థలు పడుతున్నారని సమాచారం. ఇక వారందరిని రప్పించడానికి తగిన ఏర్పాట్లను భారతీయ విదేశాంగ శాఖ పూర్తి చేసింది. చైనా అంగీకారం మేరకు ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్రత్యేక విమానాన్ని అక్కడికి పంపింది. కాగా, వారు ఇండియా చేరుకున్నాక వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి సోకిందో లేదో నిర్ధారించనున్నారు.




