వాష్‌రూమే ప్రాణాంతకం.. ప్రాణం తీసిన ‘విష’వాయువు!
నోయిడాలోని ఒక ప్రైవేట్ కంపెనీ వాష్‌రూమ్ లోపల విషపూరిత వాయువు పీల్చి 52 ఏళ్ల సతీశ్ కుమార్ సోమవారం సాయంత్రం మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం, సతీష్ కుమార్ అనే వ్యక్తి సెక్టార్ 62 యొక్క ఆర్ సిస్టమ్స్ కంపెనీలో నిర్వహణ సిబ్బందిగా పనిచేశాడు. వాష్‌రూమ్ వెళ్లిన సతీశ్ తిరిగిరాకపోవడంతో అతని మిత్రులకు అనుమానం వచ్చింది. వెళ్లి చూడగా వాష్‌రూంలో చలనం లేకుండా పడిఉన్న సతీశ్ వారి కంటపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను […]

నోయిడాలోని ఒక ప్రైవేట్ కంపెనీ వాష్‌రూమ్ లోపల విషపూరిత వాయువు పీల్చి 52 ఏళ్ల సతీశ్ కుమార్ సోమవారం సాయంత్రం మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం, సతీష్ కుమార్ అనే వ్యక్తి సెక్టార్ 62 యొక్క ఆర్ సిస్టమ్స్ కంపెనీలో నిర్వహణ సిబ్బందిగా పనిచేశాడు. వాష్‌రూమ్ వెళ్లిన సతీశ్ తిరిగిరాకపోవడంతో అతని మిత్రులకు అనుమానం వచ్చింది. వెళ్లి చూడగా వాష్‌రూంలో చలనం లేకుండా పడిఉన్న సతీశ్ వారి కంటపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సతీష్‌ను రక్షించే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని, వారిని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. వారు అదే రోజు డిశ్చార్జ్ అయ్యారు. అయితే, వాష్‌రూమ్‌లో మూత్రం నిల్వ ఉండకుండా వాడే రసాయనం నుంచి వచ్చిన వాసన వల్లే సతీశ్ మరణించాడని సదరు కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. అయితే వాష్‌రూమ్‌లో గ్యాస్ లీకేజి వల్లే అతను మరణించినట్లు సతీశ్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సతీశ్‌ను కాపాడే క్రమంలో అతని ఇద్దరు మిత్రులు గాయపడ్డారని కూడా చెప్తున్నారు.



