Supreme Court : పీఎస్‌లలో సీసీకెమెరాలు లేకపోవడంపై సుప్రీం ఆగ్రహం.. అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
పోలీస్ స్టేషన్లలో CCTV కెమేరాలు లేకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల సీఎస్‌లు డిసెంబర్ 16 వరకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో ఆయా రాష్ట్రాల సీఎస్‌లు స్వయంగా కోర్టులో విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

పోలీస్ స్టేషన్లలో CCTV కెమేరాలు లేకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల సీఎస్‌లు డిసెంబర్ 16 వరకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇచ్చిన గడువులోపు కౌంటర్లు దాఖలు చేయకపోతే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణకు 3 వారాల పాటు వాయిదా వేసింది.
అసలు ఏం జరిగింది..
పోలీస్ స్టేషన్‌లలో పారదర్శకతను పెంచడానికి, కస్టడీ హింసలను నివారించడానికి 2020లోనే అన్ని స్టేషన్లలో కెమెరాలు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, కానీ వాటిని అన్ని రాష్ట్రాలు పాటించట్లేదని, కొన్ని పోలీస్ స్టేషన్‌లలో ఉన్న అవి పనిచేయడం లేదని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై ఆగ్రహంగా వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లు కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




