Diwali: దీపావళి స్పెషల్ ‘కాజూ కలశ్’ మిఠాయి.. ధర కేజీ 20 వేలు.. దీని స్పెషాల్టీ ఏమిటంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఒక మిఠాయి షాప్ రోషన్‌లాల్ స్వీట్స్ షాప్ ఉంది. ఇక్కడ దీపావళి పండగ సందర్భంగా స్పెషల్ మిఠాయిని తయారు చేస్తున్నారు. ఈ ప్రత్యేక 'కాజూ కలశ్' మిఠాయి కేజీ రూ.20,000.
దీపావళి పండగ వచ్చిందంటే చాలు.. సందడి మొదలవుతుంది. దీపాలు, ముగ్గులు, స్వీట్స్, బాణాసంచా రకరకాల వస్తువులు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. రకరాల స్వీట్స్ అందుబాటులోకి వస్తాయి. దీంతో దీపావళికి తమ చుట్టాలకు, స్నేహితులకు స్వీట్స్ ఇచ్చి శుభాకాంక్షలు చెబుతారు. దీంతో ఈ దీపావళిని స్వీట్స్ ఇచ్చి మీ ఇష్టమైనవారితో జరుపుకునేందుకు ఆలోచిస్తున్నారా.. అయితే మా షాప్ కు రండి అంటున్నారు.. ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన ఓ దుకాణం యజమాని.. అయితే ఈ షాప్ లోని దివాళి స్పెషల్ మిఠాయిని కొనాలంటే.. సామాన్యులు కొంచెం ఆలోచించాల్సిందే.. ఎందుకంటే ఇక్కడ తయారు చేసిన మిఠాయిని కొనాలంటే.. కేజీకి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. చేయాలంటే మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే… ఈ స్వీట్స్ ను బంగారంతో తయారు చేశారట.. అందుకనే వీటి రుచి సూపర్బ్ గా ఉంటుందట.. మరి ఈ బంగారు స్వీట్స్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఒక మిఠాయి షాప్ రోషన్‌లాల్ స్వీట్స్ షాప్ ఉంది. ఇక్కడ దీపావళి పండగ సందర్భంగా స్పెషల్ మిఠాయిని తయారు చేస్తున్నారు. ఈ ప్రత్యేక ‘కాజూ కలశ్’ మిఠాయి కేజీ రూ.20,000. ఈ మిఠాయి తయారీలో 24 క్యారెట్ల బంగారంతో పాటు పైన్ గింజలు, కశ్మీర్‌లో లభించే కిశోరీ పిస్తా, కుంకుమపువ్వు వంటివి ఉపయోగించామని షాప్ యజమాని రజత్ మహేశ్వరి చెప్పారు. అంతేకాదు.. ఈ ప్రత్యేకతల కారణంగానే తాము తయారుచేసిన ‘కాజూ కలశ్’ మిఠాయి.. మిగతా స్వీట్స్ కంటే స్పెషల్ టెస్ట్ ఉంటుందన్నారు. అయితే వీటి ధర అధికంగా ఉండడంతో ఎక్కువమంది కొనుగోలు చేసే అవకాశం లేదని చెప్పారు. అదే సమయంలో కొద్ది మంది ఈ స్వీట్స్ ఖచ్చితంగా కొంటారని ధీమా వ్యక్తం చేశారు. సాధారణంగా స్వీట్స్ నాణ్యతవి అయితే 600 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటాయి. కానీ కాజూ కలశ్’ మిఠాయి ధర 20 వేలు ఉండడం విశేషం..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..