Rajiv Gandhi Murder Case: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హంతకుడు గుండెపోటుతో మృతి.. రెండేళ్ల క్రితం జైలు నుంచి విడుదల

|

Feb 29, 2024 | 11:18 AM

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవించి, జైలు నుంచి విడుదలైన ఆరుగురు దోషుల్లో ఒకడైన శాంతన్‌ (55) మృతి చెందాడు. అనారోగ్యంతో తమిళనాడులోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి (ఆర్‌జిజిహెచ్)లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో ప్రాణాలొదిలాడు. శ్రీలంకకు చెందిన శాంతన్‌ అలియాస్‌ టి సుతేంద్రరాజాతోపాటు మరో ఐదుగురిని 2022 నవంబర్‌లో సుప్రీంకోర్టు విడుదల..

Rajiv Gandhi Murder Case: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హంతకుడు గుండెపోటుతో మృతి.. రెండేళ్ల క్రితం జైలు నుంచి విడుదల
Rajiv Gandhi Murder Case
Follow us on

చెన్నై, ఫిబ్రవరి 28: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవించి, జైలు నుంచి విడుదలైన ఆరుగురు దోషుల్లో ఒకడైన శాంతన్‌ (55) మృతి చెందాడు. అనారోగ్యంతో తమిళనాడులోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి (ఆర్‌జిజిహెచ్)లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో ప్రాణాలొదిలాడు. శ్రీలంకకు చెందిన శాంతన్‌ అలియాస్‌ టి సుతేంద్రరాజాతోపాటు మరో ఐదుగురిని 2022 నవంబర్‌లో సుప్రీంకోర్టు విడుదల చేసింది. అప్పటి నుంచి తిరుచిరాపల్లి సెంట్రల్ జైలు సమీపంలోని ప్రత్యేక శిబిరంలో ఉంటున్నాడు. గత వారం చెన్నైలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) శాంతన్‌ను శ్రీలంకకు తరిమేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతోన్న శాంతన్‌ను తిరుచిరాపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జనవరి 27న RGGH ఆసుపత్రిలో చేర్చినట్లు ఆర్‌జిజిహెచ్ డీన్ ఇ తేనిరాజన్ తెలిపారు.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో అతనికి చికిత్స అందించినట్లు తేనిరాజన్ తెలిపారు. వైద్య పరీక్షల్లో సంతాన్‌కు క్రిప్టోజెనిక్ సిర్రోసిస్ అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. మంగళవారం రాత్రి అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో అతను అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు ఝామున గుండెపోటుకు గురయ్యాడు. సంతన్‌ను కాపాడేందుకు సీపీఆర్‌ చేసి వెంటిలేటర్ ఉంచినప్పటికీ అతని శరీరం చికిత్సకు స్పందించలేదు. ఈ క్రమంలో 7.50 గంటలకు శాంతన్‌ మృతి చెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శ్రీలంకకు తరలించేందుకు చట్టపరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలిపారు.

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీపై థను అనే ఎల్‌టీటీఈ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఆ దుర్ఘటనలో రాజీవ్‌ గాంధీతో పాటు మరో 14 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. హత్యాకుట్రకు నాయకత్వం వహించిన శివరాసన్‌తో పట్టుబడలేదు. ఇక మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలో ప్రమేయం ఉన్న ఏడుగురికి మొదట కోర్టు మరణశిక్ష విధింయింది. దోషుల్లో శాంతన్‌ కూడా ఒకడు. ఆ తర్వాత అతని శిక్ష జీవిత ఖైదుగా మార్చబడింది. అతను దాదాపు 30 యేళ్లకుపైగా జైలు శిక్ష అనుభవించాడు. ఐదుగురు ఇతర దోషులతో పాటు నవంబర్ 2022లో సుప్రీంకోర్టు విడుదల చేసింది

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.