రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్‌పై ఇసుక దిబ్బను గుర్తించిన లోకో పైలట్ అప్రమత్తతో వెంటనే రైలును ఆపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రఘురాజ్ సింగ్ స్టేషన్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పట్టాలు తప్పించుకునేందుకు కుట్రలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన రాయ్‌బరేలీ జిల్లాలో జరిగింది. ఖీరూన్ పీఎస్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను పోశారు. లోకోపైలట్ గమనించి, రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ట్రాక్‌పై ఉన్న ఇసుక దిబ్బను తొలగించి రైలు సేవలను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాయ్‌బరేలీ నుంచి బయలుదేరిన ప్యాజింర్ రైలు ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఇసుక కుప్పను పోశారు. అక్కడికి సమీపంలోనే రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఇక్కడి నుంచి మట్టిని తీసుకొచ్చిన ఓ లారీ డ్రైవర్ రైలు ట్రాక్‌పై పోసి వెళ్లిపోయినట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. లోకో పైలట్ సకాలంలో చూడడంతో పెను ప్రమాదం తప్పింది.
రైలు వేగం తక్కువగా ఉండడంతో లోకో పైలట్ సడెన్‌గా రైలును నిలిపివేసి ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. అదే రైలు వేగం ఎక్కువగా ఉండి ఉంటే.. పట్టాలు తప్పే ప్రమాదం ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు. డంపర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
ఈ వీడియో చూడండి..
Uttar Pradesh: A train in Raebareli was saved from derailment due to the pilot’s quick actions after soil was dumped on the tracks. An investigation into the miscreants has started pic.twitter.com/vrSrFhH80J
— IANS (@ians_india) October 7, 2024
గత నెల 22న ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ప్రేమ్‌పూర్ వద్ద జరిగింది. ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్ కనిపించింది. ఆ మార్గంలో వెళుతున్న గూడ్స్ రైలు లోకో పైలట్ దీనిని గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయడంతో ప్రమాదం తప్పింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..