Gold Seize: ముంబయి విమానశ్రయంలో భారీ బంగారం పట్టివేత.. ఎన్ని కిలోలంటే

|

Apr 03, 2023 | 7:58 PM

ముంబయి అంతర్జాతీయ విమానశ్రయంలో బంగారం పట్టుబడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలో ఇద్దరు కెన్యాకి చెందిన వ్యక్తు రూ.9 కోట్ల విలువైన 18 కిలోల బంగారాన్ని ఇండియాకి అక్రమంగా తీసుకురాగా ముంబయి ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు.

Gold Seize: ముంబయి విమానశ్రయంలో భారీ బంగారం పట్టివేత.. ఎన్ని కిలోలంటే
Gold
Follow us on

ముంబయి అంతర్జాతీయ విమానశ్రయంలో బంగారం పట్టుబడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలో ఇద్దరు కెన్యాకి చెందిన వ్యక్తు రూ.9 కోట్ల విలువైన 18 కిలోల బంగారాన్ని ఇండియాకి అక్రమంగా తీసుకురాగా ముంబయి ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు. ఇప్పుడు తాజాగా మరో అధికారులు మరో రెండు కేసులను ఛేదించారు. రూ.6 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో రెండో అతిపెద్ద గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఇదే. వివరాల్లోకి వెళ్తే శనివారం రోజున దుబాయి నుంచి యాకుబ్ మహమ్మద్ అల్ బ్లూషీ అనే ప్రయాణికుడు ముంబయి ఎయిర్ పోర్టులో దిగాడు. తన లగేజ్ ను చూపించకుండానే ఎగ్జిట్ గేట్ వైపు వెళ్లాడు.

ఇది గమనంచిన కస్టమ్స్ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకొని ఆ లగేజ్ తనిఖీ చేయగా రూ.4.6 కోట్ల విలువైన 9 కిలోల బంగారం దొరికింది. అతడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో కేసులో జీషన్ అనే ప్రయాణికుడు నుంచి రూ. 1.1 కోట్ల విలువ గల కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత రెండు నెలల్లో కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న ఎనిమిది మంది విదేశీయుల్ని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం