పొలిటికల్ పార్టీలకు రూ.2,512 కోట్ల విరాళాలు.. ఇచ్చిందెవరో తెలీదు!

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది అసోసియేషన్ ఫర్ డెమెక్రాటిక్ రిఫామ్స్ సంస్థ. 2018-19 విరాళాల రూపంలో అన్ని పార్టీలకు కలిపి రూ.2,512 కోట్లు వచ్చినట్టు..

పొలిటికల్ పార్టీలకు రూ.2,512 కోట్ల విరాళాలు.. ఇచ్చిందెవరో తెలీదు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 10, 2020 | 5:14 PM

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది అసోసియేషన్ ఫర్ డెమెక్రాటిక్ రిఫామ్స్ సంస్థ. 2018-19 విరాళాల రూపంలో అన్ని పార్టీలకు కలిపి రూ.2,512 కోట్లు వచ్చినట్టు అధ్యయనంలో తేలింది. సాధారణంగా.. రాజకీయ పార్టీలకు రూ.20 వేల లోపు విరాళాలు ఇచ్చినట్లైతే వ్యక్తుల పేర్లను కానీ.. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు కానీ వెల్లడించాల్సిన అవసరం లేదు. అయితే.. రూ.20 వేల పైన ఎవరైతే.. పొలిటికల్ పార్టీలకు విరాళాలను ఇస్తారో.. వారి పేర్లను ఖచ్చితంగా నమోదు చేయాలి. ఇప్పుడు దీన్నే సాకుగా చూపుతూ రాజకీయ పార్టీలు.. దాతల వివరాలను అజ్ఞతంగా ఉంచుతున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ సంస్థ జరిపిన విశ్లేషణలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

1. 2018-19లో అన్ని పార్టీలకు కలిపి రూ.2,512 కోట్లు విరాళాలు వచ్చాయి. అందులో బీజేపీకి అందినవి రూ,1,612 కోట్లు. అంటే దాదాపు 64 శాతం ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి. ఇక కాంగ్రెస్‌కి రూ.728 కోట్లు రాగా.. మిగతా పార్టీలకు రూ.2,088 కోట్లు వచ్చాయి.

2. అజ్ఞాత విరాళాల్లో 78 శాతం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమకూరింది. ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారి చిరుమానాలు తెలియవు. వీటి విలువ రూ.1,960 కోట్లు అంటే ఎక్కువ మంది పేర్లు వెల్లడించడానికి ఇష్టపడకుండా ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేస్తున్నారు.

3. పేర్లు బయటికి తెలిసేలా రూ.20 వేలకు మించిన విలువ చేసే ఎలక్టోరల్ బాండ్లను చాలా తక్కువ మందికి కొనుగోలు చేస్తారు. అయితే తమకు రూ.20వేల విలువకు మించిన బాండ్లేవీ రాలేదని బీఎస్పీ తెలిపింది.

Read More: ఒంటరైన మారుతీరావు భార్య.. నేరం ఎవరిది? శిక్ష ఎవరికి!

Read More also this: శ్మశాన వాటికలో ఉద్రిక్త పరిస్థితులు.. కడసారి చూపుకు నోచుకోని అమృత 

ఇది కూడా చదవండి: అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరిపై సినిమా.. హీరో ఎవరంటే?