RRB NTPC Result 2021: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్( RRB) NTPC CBT 1 ఫలితాలపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిహార్‌లో పలు రైల్వే స్టేషన్లలో నిరసనకు దిగారు. ఫలితాలతో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. బోర్డు పరీక్షకు కటాఫ్‌ను పెంచిందని, తద్వారా అనేక మంది అభ్యర్థులు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఒకే అభ్యర్థిని పలు పోస్టులకు ఎంపిక చేశారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనల కారణంగానే రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. పరీక్ష ఫలితాల్లో రిగ్గింగ్ జరిగిందని, తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఆరా రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 5 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, అభ్యర్థుల నిరసనపై రైల్వే అధికారులు, పాట్నా జిల్లా అధికార యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్య పరిష్కారానికి నిరసనలు మార్గం కాదని, రైలు సేవలకు అంతరాయం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
ఇదిలాఉంటే.. అభ్యర్థుల ఆరోపణపై రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు జరుగలేదని, నిబంధనల ప్రకారమే ఫలితాలు ప్రకటించడం జరిగిందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.
Nalanda, Bihar: Students who appeared for Railway Recruitment Board’s Non-Technical Popular Categories exam 2021 protested at Bihar Sharif railway station alleging discrepancies in the results pic.twitter.com/9w0ajSBAef
— ANI (@ANI) January 25, 2022
Also read:
Vastu Tips for Plants: ఇంట్లో ఈ 10 మొక్కలు నాటండి.. లక్ష్మి దేవి అనుగ్రహం పొందండి..
Viral Video: కుమ్మేందుకు దూసుకొచ్చి గొర్రె.. ఆ వ్యక్తి తప్పించుకున్న విధానం చూస్తే వావ్ అనాల్సిందే..