Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది దుర్మరణం.. 30 మందికి తీవ్ర గాయాలు..

Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు, ఆటో ఢీకొని 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 30 మంది తీవ్రంగా..

Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది దుర్మరణం.. 30 మందికి తీవ్ర గాయాలు..
Accident

Updated on: Jun 08, 2021 | 11:28 PM

Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు, ఆటో ఢీకొని 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన యూపీలోని కాన్పూర్‌లో సచేండి ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక లాలా లజ్‌పత్ రాయ్ ఆస్పత్రికి తరలించారు. ఇక గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాంతో మరణాలు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

బస్సు అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. ఈ రోడ్డు ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ స్పందించారు. ప్రమాద తీవ్రతను తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ఆదేశించారు.

Also read: These Foods : పరగడుపున ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు..! చాలా డేంజర్.. ఎందుకో తెలుసుకోండి..?

Four Ingredients : ఊపిరితిత్తుల చక్కటి పనితీరు కోసం ఈ నాలుగు దినుసులు తప్పనిసరి..! అవి ఏంటంటే..?

Drumstick Benfits : శాకాహారుల మాంసాహారి మునక్కాయ..! గర్భిణీలకు ఒక వరంలాంటిది.. ఎందుకో తెలుసా..?