Ajmer 92 Horror Returns: దేశాన్ని కుదిపేస్తున్న అజ్మీర్ లైంగిక దాడి కేసు.. వెలుగులోకి వస్తున్న సంచలనాలు..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అజ్మీర్ గ్యాంగ్ లైంగిక దాడి కేసులో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంస్టాగ్రామ్ ద్వారా బాధితురాలికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన నిందితులు లోబర్చుకుంటున్నారు.

Ajmer 92 Horror Returns: దేశాన్ని కుదిపేస్తున్న అజ్మీర్ లైంగిక దాడి కేసు.. వెలుగులోకి వస్తున్న సంచలనాలు..!
Return Of Ajmer 1992 Horror
Follow us

|

Updated on: Jun 11, 2024 | 6:41 PM

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అజ్మీర్ గ్యాంగ్ లైంగిక దాడి కేసులో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంస్టాగ్రామ్ ద్వారా బాధితురాలికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన నిందితులు లోబర్చుకుంటున్నారు. అమ్మాయిల ఫోటోలను మార్చేసి, బెదిరించి డబ్బులు వసూలు చేసి మళ్లీ సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అజ్మీర్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.

సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి వారి ఫోటోలను మార్పింగ్ చేయడం నిందితులు చేసే మొదటి పని. మార్ఫ్ చేసిన అశ్లీల ఫోటోలను అమ్మాయిలకు పంపించి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆ డబ్బులు కాష్ పేమెంట్ రూపంలోనే చేయాలని బాధితులను ఒప్పిస్తారు. ఈ నెపంతో బాధితురాలిని అక్కడికి రప్పించుకుని ఆమెపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడతున్నారు దుండగులు. ఈ దుర్మార్గాన్ని వీడియో చిత్రీకరించి పదే పదే బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ, ఆమె దగ్గరి నుండి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇది అజ్మీర్ గ్యాంగ్ కథ..!

వీరంతా ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను ట్రాప్ చేసే పనిలో ఉంటారని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే ఇంటర్ చదువుతున్న ఒక యువతి కోచింగ్ సెంటర్‌లో చేరింది. యువతికి మరో స్నేహితురాలు పరిచయమైంది. పరిచయమైన సదరు యువతి ఇర్ఫాన్ అనే పేరుతో ఉన్న ఇంస్టాగ్రామ్ ఐడిని ఫ్రెండ్ రిక్వెస్ట్ ద్వారా యాక్సెప్ట్ చేయాలని బాధితురాలికి చెప్పింది. అసలు విషయం తెలియని బాధితురాలు తన స్నేహితురాలు చెప్పిన విధంగానే ఇంస్టాగ్రామ్‌లో ఇర్ఫాన్ అనే పేరుతో ఉన్న ఐడిని ఫ్రెండ్ రిక్వెస్ట్ గా యాక్సెప్ట్ చేసింది. అంతే..! అప్పటినుండి యువతి ఫోటోలు డౌన్‌లోడ్ చేసుకున్న నిందితులు వాటిని మార్పింగ్ చేయడం మొదలుపెట్టాడు. మార్పింగ్ చేసిన ఫోటోలను తిరిగి ఆ యువతి ఇంస్టాగ్రామ్‌కు పంపించాడు. తాను కోరినంత డబ్బులు ఇవ్వకుంటే వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని యువతిని బెదిరించాడు.

డీల్ కు ఒప్పుకున్న యువతి 5 లక్షల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ డబ్బు కోసం తన ఇంట్లో ఉన్న డబ్బులు యువతి దొంగలించింది. ఆ డబ్బులు తీసుకుని ఒక చోటికి రావాలని బాధితురాలిని నిందితుడు లొకేషన్ పెట్టాడు. డబ్బుతో ఒక ప్రదేశానికి వెళ్లిన యువతిని నిందితుడితోపాటు అతని స్నేహితులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో దుశ్చర్య మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించారు. తిరిగి ఆ వీడియోని యువతికి పంపించి, మరో 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు.

అంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించలేకపోవటంతో యువతి తన ఇంట్లో అసలు విషయాన్ని చెప్పేసింది. దీంతో బాధిరాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అజ్మీర్ పోలీసులు ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. అక్టోబర్ 2023 నుండి ఈ తతంగమంతా కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. సరిగ్గా 1992 లోనూ ఇదే తరహాలో అజ్మీర్‌లో భారీ అశ్లీల ముఠా బయటపడింది. ఆ సమయంలో దాదాపు 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్టుతో అజ్మీర్ ప్రాంతమంతా అల్లర్లతో మారుమోగింది.

తాజాగా చోటు చేసుకున్న ఘటనలో సైతం నిందితులు మొత్తం ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన యువకులే. దీంతో ఈ ఘటనను కళ్ళారా చూస్తున్న అజ్మీర్ స్థానికులకు 1992 నాటి ఘటనలు గుర్తు చేసుకున్నారు. తాజా ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులు 19 నుండి 23 సంవత్సరాలు లోపు వారే కావడం విశేషం. తాజా ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతుండటంతో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్