Bangladesh: మాజీ ఆర్మీ చీఫ్ సంచలన డిమాండ్.. బంగ్లాదేశ్ విభజించి హిందువులకు కొత్త దేశాన్ని ఇవ్వాలని మ్యాప్ రిలీజ్..

|

Dec 06, 2024 | 10:33 AM

బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులు పరిస్థితి పై సర్వతా నిరసన వ్యక్తం అవుతుంది. మన దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడులపై నిరసన తెలియజేస్తూ ర్యాలీలను చేస్తున్నారు. బంగ్లాదేశ్ లోని తాజా పరిస్థితిపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ జిడి బక్షి స్పందించారు. అంతేకాదు హిందువులపై జరుగుతున్న ఈ దాడులకు చెక్ పెట్టడానికి సరికొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకుని వచ్చారు.

Bangladesh: మాజీ ఆర్మీ చీఫ్ సంచలన డిమాండ్.. బంగ్లాదేశ్ విభజించి హిందువులకు కొత్త దేశాన్ని ఇవ్వాలని మ్యాప్ రిలీజ్..
Ex Army General On Bangladesh
Follow us on

బంగ్లాదేశ్‌లో హిందువులపై వేధింపులు కొనసాగుతున్నాయి. మైనార్టీలపై దాడులు, ఇళ్లను ధ్వసం చేస్తున్న సంఘటనలకు సంబందించిన వార్తలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిపై భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అదే సముయంలో పలువురు హిందువుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ హిందువుల కోసం ‘హిందూదేశ్’ సృష్టించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్ చేస్తోన్న వారు మరెవరో కాదు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ జిడి బక్షి. ఈ విషయాన్నీ తన X హ్యాండిల్‌లో పోస్ట్ చేసి బంగ్లాదేశ్ ఏర్పడం కోసం భారతీయ సైనికుల త్యాగాలను గుర్తు చేశారు.

హిందువులను రోజుకో రకంగా దారుణంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో యుకే పార్లమెంట్ లో తమ మౌనం వీడగా ట్రంప్ మంత్రి వర్గంలోని వారు కూడా ఇప్పటికే స్పందించారు. అయితే తాజాగా మాజీ ఆర్మీ రిటైర్డ్ జనరల్ జీడీ బక్షి కూడా నోరు విప్పారు. బంగ్లాదేశ్లోని హిందువుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ రాడికల్ జిహాదీ దేశంగా మారింది. మారణహోమం సృష్టించి.. తమ దేశంలో ఉన్న మైనారిటీ హిందువులను దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. యుద్ధానికి సిద్ధమయ్యారన్నారు. పాకిస్తాన్ ఏలుబడిలో ఉన్న సమయంలో 1971లో 3800 మందికి పైగా భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళ సిబ్బంది పోరాడి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది. పాక్ సైన్యం నుంచి బంగ్లాదేశ్ ను విడిపించేందుకు ఎందరో భారతీయు సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. అయితే వీరు అసలు కృతజ్ఞత లేని వారు..అందుకే హిందూ మైనారిటీలను అంతం చేయాలనుకునే దిశగా నడుస్తున్నారు. కనుక ఇప్పుడు ఈ సమస్యకు సరైన సాధ్యమైన మార్గం..దేశాన్ని రెండుగా విడగొట్టి.. హిందూస్తాన్ ను ఏర్పాటు చేయమే అని చెప్పారు.

ఈ పోస్ట్ తో పాటు బంగ్లాదేశ్ మ్యాప్ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఆ మ్యాప్ లో బంగ్లాదేశ్ ఉత్తర భాగాన్ని విభజించి హిందూ దేశ్ గా ఏర్పాటు చేయమని సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రాథమికంగా రంగ్‌పూర్, దినాజ్‌పూర్‌లను ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని జనరల్ జీడీ బక్షి డిమాండ్ చేశారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..