Ration Card: ఆన్‌లైన్‌లో రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి.. ఎలాంటి పత్రాలు అవసరం.. రాష్ట్రాల వారీగా లింక్‌లు

Ration Card: భారతదేశంలోని దాదాపు ప్రతి వ్యక్తికి రేషన్ కార్డ్ అనేది అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. ఇది రాష్ట్ర ప్రభుత్వంచే జారీ చేయబడుతుంది...

Ration Card: ఆన్‌లైన్‌లో రేషన్‌  కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి.. ఎలాంటి పత్రాలు అవసరం.. రాష్ట్రాల వారీగా లింక్‌లు
Follow us

|

Updated on: Jan 16, 2022 | 7:22 AM

Ration Card: భారతదేశంలోని దాదాపు ప్రతి వ్యక్తికి రేషన్ కార్డ్ అనేది అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. ఇది రాష్ట్ర ప్రభుత్వంచే జారీ చేయబడుతుంది. ప్రభుత్వం జారీ చేసిన ఆహారం, ఇంధనం మరియు ఇతర వస్తువుల రేషన్‌కు కార్డు దారుడు పొందవచ్చు. అయితే సబ్సిడీ ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు కార్డులు ప్రధానంగా ఉపయోగించబడతాయి (గోధుమ, బియ్యం, పంచదార, కిరోసిన్.) వంటివి. కార్డు వివరాలు వ్యక్తి గుర్తింపు , నివాసానికి సంబంధించిన ముఖ్యమైన రుజువుకు రేషన్‌ కార్డు ఉపయోగపడుతుంది. అలాగే నివాస ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, ఓటరు ID కార్డ్ మొదలైన వాటి కోసం దరఖాస్తు చేసేటప్పుడు సాధారణంగా గుర్తింపు రుజువుగా ఉపయోగించబడుతుంది కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవలే రేషన్‌ కార్డును డిజిటలైజ్ చేయడం ప్రారంభించాయి. ఈ కార్డుల నిర్వహణ వ్యక్తిగత రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించబడుతున్నందున డిజిటల్ రేషన్ కార్డులకు మారడం భారతదేశం అంతటా ఇంకా జరగలేదు. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ముందుగా అమల్లోకి తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం.

రేషన్ కార్డుల రకాలు

► నీలం/పసుపు/ఆకుపచ్చ/ఎరుపు రేషన్ కార్డులు. ఇవి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వ్యక్తుల కోసం. ఈ రేషన్ కార్డులు ఆహారం, ఇంధనం, ఇతర వస్తువులపై వివిధ రాయితీలను పొందడం కోసం ఉపయోగపడుతుంది.

► తెల్ల రేషన్ కార్డులు – ఈ రేషన్ కార్డులు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వ్యక్తుల కోసం అందిస్తారు.. వారు గుర్తింపు రుజువుగా కూడా ఉపయోగపడుతుంది.

రేషన్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

భారతదేశంలో శాశ్వతంగా నివసిస్తున్న ఏ వ్యక్తి అయినా రేషన్ పొందాలనుకునవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ

► రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ, డిజిటల్ లేదా ఇతరత్రా దరఖాస్తుదారుడు దరఖాస్తు చేస్తున్న రాష్ట్రం ఆధారంగా మారుతుంది. ప్రతి రాష్ట్రానికి సొంత నియమ నిబంధనలు ఉన్నాయి. రాష్ట్రాల నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్రాల వారీగా లింక్‌లు:

► ఆంధ్రప్రదేశ్- https://ap.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx

► అరుణాచల్ ప్రదేశ్- http://www.arunfcs.gov.in/forms.html

► బీహార్- http://sfc.bihar.gov.in/login.htm (డిజిటల్‌ రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు)

► ఛత్తీస్‌గఢ్- https://khadya.cg.nic.in/citizen/documents/New_Rc_Format.pdf

► గుజరాత్- https://www.digitalgujarat.gov.in/Citizen/CitizenService.aspx (డిజిటల్‌ రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు), ఫామ్‌ డౌన్‌లోడ్‌ కోసం www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s51.pdf

► హర్యానా- http://saralharyana.gov.in (డిజిటల్‌ రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు లింక్‌)

► హిమాచల్ ప్రదేశ్- http://admis.hp.nic.in/ehimapurti/pdfs/cardeng.pdf (ఫామ్‌ డౌన్‌లోడ్ కోసం)

► జమ్మూ కాశ్మీర్ –http://jkfcsca.gov.in/FormsGeneral.html

► జార్ఖండ్- https://pds.jharkhand.gov.in/secc_cardholders/ercmsActivityRequest (డిజిటల్‌ రేషన్‌ కార్డు దరఖాస్తు కోసం)

► కేరళ- http://ecitizen.civilsupplieskerala.gov.in/index.php/c_user_home (డిజిటల్‌ రేషన్‌ కార్డు దరఖాస్తు కోసం)

► మహారాష్ట్ర- https://rcms.mahafood.gov.in/PublicLogin/frmPublicUserRegistration.aspx https://aaplesarkar.mahaonline.gov.in/en (డిజిటల్‌ రేషన్‌ కార్డు దరఖాస్తు కోసం)

► మిజోరం- https://fcsca.mizoram.gov.in/page/application-form1506663142 (రేషన్‌ కార్డు దరఖాస్తు కోసం ఫామ్‌ డౌన్‌లోడ్‌)

► ఒడిషా-http://www.foododisha.in/Download/NFSA.pdf (ధరఖాస్తు కోసం ఫామ్‌ డౌన్‌లోడ్‌)

► పంజాబ్ – http://punjab.gov.in/eform/CitizenReg.xhtml (డిజిటల్‌ రేషన్‌ కార్డు దరఖాస్తు కోసం)

► ఢిల్లీ –https://edistrict.delhigovt.nic.in/in/en/Account/Register.html (డిజిటల్‌ రేషన్‌ కార్డు దరఖాస్తు కోసం)

► పశ్చిమ బెంగాల్ – https://wbpds.gov.in/rptForUsers/rptFormDetails_usr.aspx (రేషన్‌ కార్డు దరఖాస్తుకు ఫామ్‌ డౌన్‌లోడ్‌ లింక్‌)

► అండమాన్ మరియు నికోబార్ దీవులు- http://dcsca.andaman.go (డిజిటల్‌ రేషన్‌ కార్డు దరఖాస్తు కోసం)

► దాద్రా మరియు నగర్ హవేలీ –http://epds.nic.in/DN/epds/ (డిజిటల్‌ రేషన్‌ కార్డు దరఖాస్తు కోసం)

► త్రిపుర – http://epdstr.gov.in/TR/epds (రేషన్‌ కార్డు దరఖాస్తు కోసం ఫామ్‌ డౌన్‌లోడ్‌)

గమనిక: ఇందులో రాష్ట్రాల వారీగా డిజిటల్‌ కార్డు కోసం దరఖాస్తులు, దరఖాస్తుల ఫారాలు డౌన్‌లోడ్‌ చేసుకుని కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ వివరాలు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ వెబ్‌సైట్ల ప్రకారం అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే ఆయా రాష్ట్రాల వెబ్‌సైట్‌లను సందర్శించాలి.

రేషన్ కార్డు కోసం అవసరమైన పత్రాలు:

► గుర్తింపు, నివాసం రుజువు

► చిరునామా, స్టాంప్ ఉన్న పోస్టల్ కవర్ లేదా పోస్ట్‌కార్డ్.

► మూడు పాస్‌పోర్ట్‌ల సైజు ఫోటోలు

► గతంలో దఖాస్తు చేసుకుని తిరస్కరణకు గురైన వాటి వివరాలు

► ఏదైనా LPG కనెక్షన్ వివరాలు

► మొబైల్ నంబర్/ఈమెయిల్ ఐడీ

► రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి గుర్తింపు, చిరునామా రుజువు పత్రాలు

► ఆధార్ కార్డు

► ఉద్యోగి గుర్తింపు కార్డు

► ఓటరు ID

► పాస్‌ పోర్టు

► ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు

► ఆరోగ్య కార్డు

► వాహన లైసెన్స్‌

► వివాహ ధ్రువీకరణ పత్రం

►జనన ధృవీకరణ పత్రం

ఇవి కూడా చదవండి:

Covid 19 Insurance: మీకు కరోనా వచ్చిందా..? హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కావాలంటే మూడు నెలలు ఆగాల్సిందే..!

Maruti Suzuki: వాహనదారులకు షాకిచ్చిన మారుతి సుజుకి.. పెరిగిన కార్ల ధరలు.. ఎంత అంటే..!

Latest Articles