Ration Card: రేషన్‌ కార్డు ఉంటే ఉచిత నిత్యావసరాలు మాత్రమే కాదు..! మరెన్నో ఉపయోగాలు, ప్రయోజనాలు..

|

Apr 20, 2023 | 12:20 PM

రేషన్ కార్డు రేషన్ షాపు నుండి నిత్యవసర వస్తువులు తీసుకోవటానికి మాత్రమే కాకుండా, బలమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. ఈ కార్డు బ్యాంకు ఖాతా, స్కూల్స్-కాలేజీలు, ఓటరు ఐడి, సిమ్ కార్డు కొనడం, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఉపయోగపడుతుంది. బ్యాంకు సంబంధిత..

Ration Card: రేషన్‌ కార్డు ఉంటే ఉచిత నిత్యావసరాలు మాత్రమే కాదు..! మరెన్నో ఉపయోగాలు, ప్రయోజనాలు..
Ration Card
Follow us on

మీకు కూడా రేషన్ కార్డు ఉండి, ప్రభుత్వం నుండి ప్రతి నెల ఉచిత రేషన్ పొందుతున్నట్లయితే, ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుల ద్వారా పేదలకు ఉచితంగా, చౌకగా ఆహార ధాన్యాలను అందజేస్తున్నాయి. కానీ రేషన్ కార్డు ద్వారా ఉచిత రేషన్ మాత్రమే కాకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలతో సహా అనేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

ప్రజలకు అందుబాటులో ఉన్న అనేక సౌకర్యాలు:

రేషన్ కార్డు రేషన్ షాపు నుండి నిత్యవసర వస్తువులు తీసుకోవటానికి మాత్రమే కాకుండా, బలమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. ఈ కార్డు బ్యాంకు ఖాతా, స్కూల్స్-కాలేజీలు, ఓటరు ఐడి, సిమ్ కార్డు కొనడం, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఉపయోగపడుతుంది. బ్యాంకు సంబంధిత ఉద్యోగం లేదా గ్యాస్ కనెక్షన్ పొందడానికి రేషన్ కార్డును ఉపయోగించవచ్చు. ఓటరు గుర్తింపుకార్డు తయారు చేసే సమయంలో ఐడీ కార్డును కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు రేషన్ కార్డు వాడితే సరిపోతుంది.

ఎవరు రేషన్ కార్డు పొందవచ్చు? :

మీ కుటుంబ ఆదాయం 27 వేల రూపాయల కంటే తక్కువ ఉంటే, మీరు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దారిద్య్ర రేఖకు ఎగువన (APL), దారిద్య్ర రేఖకు దిగువన (BPL) కార్డ్‌లు, అంత్యోదయ రేషన్ కార్డ్‌లు (AAY) అర్హత ఆధారంగా ప్రభుత్వం నుండి పొందవచ్చు .

ఇవి కూడా చదవండి

మీరు ఆన్‌లైన్‌లో రేషన్ కార్డు పొందాలనుకుంటే, మీరు https://ahara.kar.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ, దరఖాస్తు చేసిన కొన్ని రోజుల తర్వాత, రేషన్ కార్డు మీ చిరునామాకు చేరుతుంది. రేషన్ కార్డు ఇవ్వడానికి ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, ఏదైనా ఐ కార్డ్, హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..