Mohan Bhagwat: ‘వసుధైవ కుటుంబం’ స్ఫూర్తిని వ్యాప్తి చేయడంలో హిందువులదే ముఖ్యమైన పాత్రః మోహన్ భగవత్

భౌతికవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానంతో ప్రయోగాలు చేసి అల్లాడుతున్న ప్రపంచానికి, భారతదేశం సంతోషం, సంతృప్తి మార్గాన్ని చూపుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. 'వసుధైవ కుటుంబం' స్ఫూర్తిని వ్యాప్తి చేయడంలో హిందువులు ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని భగవత్ అన్నారు.

Mohan Bhagwat: 'వసుధైవ కుటుంబం' స్ఫూర్తిని వ్యాప్తి చేయడంలో హిందువులదే ముఖ్యమైన పాత్రః మోహన్ భగవత్
Mohan Bhagawat In World Hindu Congress
Follow us

|

Updated on: Nov 24, 2023 | 5:32 PM

భౌతికవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానంతో ప్రయోగాలు చేసి అల్లాడుతున్న ప్రపంచానికి, భారతదేశం సంతోషం, సంతృప్తి మార్గాన్ని చూపుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన మూడవ ప్రపంచ హిందూ కాంగ్రెస్ (WHC) ప్రారంభ సెషన్‌లో భగవత్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాలన్నారు. హిందువులంతా కలిసి ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచం ఒకే కుటుంబం అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన మేధావులు, కార్యకర్తలు, నాయకులు, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హిందువులందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ కలుసుకుంటారు. ప్రపంచంతో కనెక్ట్ అయ్యే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.

అన్ని రంగాల్లోనూ ప్రపంచం అల్లాడిపోతోంది. 2,000 సంవత్సరాలుగా ఆనందం, శాంతిని తీసుకురావడానికి అనేక ప్రయోగాలు చేశారు. భౌతికవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానంతో ప్రయోగాలు చేశారు. అనేక మతాలకు సంబంధించిన ప్రయోగాలు చేశారు. భౌతిక శ్రేయస్సు పొందారు. కానీ సంతృప్తి లేదన్న ఆయన.. భారత్ దేశం మాత్రం ప్రపంచ శ్రేయస్సు కోరుకుంటుందన్నారు. కోవిడ్ మహమ్మారి తరువాత, ప్రపంచం మొత్తం పునరాలోచన చేయడం ప్రారంభించారు. ఇప్పుడు భారత్ మార్గాన్ని చూపుతుందనే ఆలోచనలో ఏకగ్రీవంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు మోహన్ భగవత్. నిస్వార్థ సేవలో మనం ప్రపంచ నాయకులను ఏకం చేయాలన్నారు. మన సంప్రదాయాలు, విలువలలో ఉంది. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు చేరువవ్వండి, వారి హృదయాలను గెలుచుకోండి అంటూ పిలుపునిచ్చారు. ‘వసుధైవ కుటుంబం’ స్ఫూర్తిని వ్యాప్తి చేయడంలో హిందువులు ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని భగవత్ అన్నారు.

ఇందు కోసం మనం కలిసి రావాలి, కలిసి జీవించాలి, కలిసి పని చేయాలి అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రపంచానికి ఏదైనా సహకారం అందించాలని భగవత్ అన్నారు. పగ, ద్వేషం, ద్వేషపూరిత ప్రసంగాలు, దురుద్దేశం, అహం అనేవి మనుషులను ఒకచోట చేర్చి సమాజాన్ని లేదా సంస్థను విచ్ఛిన్నం చేస్తాయని ఆయన అన్నారు. ప్రపంచ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ అధ్యక్షుడు స్వామి విజ్ఞానానంద శంఖు ఊదుతూ సదస్సును ప్రారంభించారు. 60కి పైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ మూడు రోజుల సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…