Sabarimala: అయ్యప్ప భక్తులకు వాన కష్టాలు.! వాతావరణ శాఖ హెచ్చరిక..
శబరిమల అయ్యప్ప భక్తులకు వాన కష్టాలు మొదలయ్యాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ అయ్యప్పభక్తులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, నడిచి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా భారీవర్షాలు కురుస్తున్నాయి.
శబరిమల అయ్యప్ప భక్తులకు వాన కష్టాలు మొదలయ్యాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ అయ్యప్పభక్తులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, నడిచి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కేరళ, తమిళనాడు, రాష్ట్రాలకు భారతవాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. పుదుచ్చేరిలో కూడా ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో గురువారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ కారణంగా అధికారులు ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కన్యాకుమారిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. ఎటుచూసినా ట్రాఫిక్.. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. పుదుచ్చేరిలో 12 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తమిళనాడులోని 35 జిల్లాల్లో 13.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2, 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.