అరుదైన‌ రెండు తలల పాము…దీని విలువెంతో తెలుసా..?

సాధారణంగా పాము అంటే ఒక తల ఉంటుంది.. అలాగే రెండు తలల పాము అంటే ముందు ఒక తల, వెనుకొక తల ఉంటుంది. కానీ , అక్క‌డ

అరుదైన‌ రెండు తలల పాము...దీని విలువెంతో తెలుసా..?
Follow us
Jyothi Gadda

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 08, 2020 | 4:33 PM

క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. మ‌నుషులంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో చాలా ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో అడ‌వి జంతువులు ఊళ్ల‌ల్లోకి రావ‌టం చాలా చోట్ల జ‌రుగుతోంది. కొన్ని చోట్ల పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగు బంట్లు వంటి క్రూర‌మృగాలు వీధుల్లోకి వ‌చ్చి విహ‌రించాయి. మ‌రికొన్ని ప్రాంతాల్లో మ‌యూరాలు చేరి వ‌య్యారంగా నాట్యం చేసిన దృశ్యాలు కూడా మ‌నం చూశాం. అయితే, అక్క‌డ మాత్రం ఓ అరుదైన స‌ర్పం వ‌చ్చి ఓ ఇంట్లో దూరింది.

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో అరుదైన రెండు త‌ల‌ల పాము ప్ర‌త్య‌క్ష‌మైంది. ఒడిశాలోని కియోంజార్ జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో రెండు తలల పాముని గుర్తించారు. అయితే, సాధారణంగా పాము అంటే ఒక తల ఉంటుంది.. అలాగే రెండు తలల పాము అంటే ముందు ఒక తల, వెనుకొక తల ఉంటుంది. కానీ ఒడిశాలో కనిపించిన ఈ పాముకి తల ప్రాంతంలో రెండు తలలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ రెండు తలల పాము విషపూరితమైనది. రెండు తలలు ఉండడంతో దీనికి నాలుగు కళ్లు, రెండు నాలుకలు ఉన్నాయి. శరీరం ఒకటే అయినా రెండు తలలు వేరు వేరుగా పనిచేస్తున్నాయి. ఆహారం కోసం ఈ రెండు తలలు వేర్వేరుగా వెతుకులాట మొదలుపెడుతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ పామును సురక్షితంగా అడవిలో వదిలేశారని సుశాంత నంద పేర్కొన్నారు. కాగా, సోష‌ల్ మీడియాలో చేరిన ఆ పాము ఇప్పుడు నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తోంది.