తమిళనాడులో ఉద్రిక్తత.. సీపీఎం కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ.. రీజన్ ఇదే..

తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం మద్యం షాపులు తెరవడానికి అనుమతిలివ్వడాన్ని నిరసిస్తూ.. మధురై శుక్రవారం నాడు పలు మహిళా సంఘాలు, సీపీఎం కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. మద్యం షాపులు తెరవడమేంటని.. ఇది వైరస్ వ్యాప్తికి అవకాశం ఉందని ఆరోపించారు. గత నలభై రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను మరింత కష్టాల్లోకి నెడుతుందని.. తెరిచిన మద్యం షాపులను వెంటనే మూసేయాలంటూ డిమాండ్ చేశారు. అటు తిరుచ్చిలో కూడా మహిళా సంఘాలు […]

తమిళనాడులో ఉద్రిక్తత.. సీపీఎం కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ.. రీజన్ ఇదే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 08, 2020 | 4:25 PM

తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం మద్యం షాపులు తెరవడానికి అనుమతిలివ్వడాన్ని నిరసిస్తూ.. మధురై శుక్రవారం నాడు పలు మహిళా సంఘాలు, సీపీఎం కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. మద్యం షాపులు తెరవడమేంటని.. ఇది వైరస్ వ్యాప్తికి అవకాశం ఉందని ఆరోపించారు. గత నలభై రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను మరింత కష్టాల్లోకి నెడుతుందని.. తెరిచిన మద్యం షాపులను వెంటనే మూసేయాలంటూ డిమాండ్ చేశారు. అటు తిరుచ్చిలో కూడా మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం వెంటనే మద్యం షాపులను మూసేయాలంటూ నినాదాలు చేశారు. ఆందోళన కారులను చెదరగోట్టేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.

కాగా, తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో దాదాపు పదిహేను వందల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.