Azam Khan: అజమ్‌ఖాన్‌కి మూడేళ్ల జైలు.. విద్వేష వ్యాఖ్యల కేసులో కీలక తీర్పు.. ఎమ్మెల్యే సీటుకే ఎసరు..

ఆయన నోటి దురుసే ఆయన పాలిట శాపంగా మారింది. కట్‌చేస్తే మూడేళ్ల పాటు జైల్లో కూర్చోమంటూ కోర్టు తీర్పునిచ్చింది. అతడి పదవి కూడా ప్రమాదంలో పడింది. ఇంతకీ ఎవరా నేత. ఆయన చేసిన తప్పేంటి? ఉత్తర ప్రదేశ్ లో..

Azam Khan: అజమ్‌ఖాన్‌కి మూడేళ్ల జైలు.. విద్వేష వ్యాఖ్యల కేసులో కీలక తీర్పు.. ఎమ్మెల్యే సీటుకే ఎసరు..
Azam Khan
Follow us

|

Updated on: Oct 28, 2022 | 8:19 AM

ఆయన నోటి దురుసే ఆయన పాలిట శాపంగా మారింది. కట్‌చేస్తే మూడేళ్ల పాటు జైల్లో కూర్చోమంటూ కోర్టు తీర్పునిచ్చింది. అతడి పదవి కూడా ప్రమాదంలో పడింది. ఇంతకీ ఎవరా నేత. ఆయన చేసిన తప్పేంటి? ఉత్తర ప్రదేశ్ లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న సీనియర్ నేత అజమ్‌ ఖాన్‌ చిక్కుల్లో పడ్డారు. సమాజ్‌వాదీ పార్టీలో అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ తర్వాత అంతటి క్రేజున్న అజం ఖాన్‌కు ముూడేళ్ల జైలు శిక్ష విధించింది రాంపూర్ కోర్టు. 2019 లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై కోర్టు సీరియస్ అయ్యింది. ఒక ఐఏఎస్ అధికారిని కూడా దూషించినట్టు ఈయనపై ఆరోపణలున్నాయి. అన్ని డోర్లూ ముూసుకుపోలేదు. పైకోర్టులో అప్పీల్ చేసుకుంటా. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా అంటున్నారు అజంఖాన్. ప్రజా ప్రతినిధులెవరైనా రెండేళ్లకు మించి జైల్లో ఉంటే వాళ్ల పదవికి ఊస్టింగ్ తప్పదు. ఇప్పుడు కనుక హైకోర్టుకు వెళ్లకపోతే అజాంఖాన్ ఎమ్మెల్యే పదవి కూడా ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. అందుకే అసెంబ్లీ స్పీకర్‌కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా న్యాయపోరాటం చేయాలని అజం ఖాన్ నిర్ణయించారు.

హేట్‌ స్పీచ్‌కి సంబంధించినవి మాత్రమే కాదు అవినీతి, దొంగతనం లాంటి అనేక అభియోగాలతో ఆయనపై 90 దాకా కేసులున్నాయి. చీటింగ్ కేసులో అరెస్టై ఈ ఏడాది మొదట్లో బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు అజంఖాన్. ఇప్పుడు మళ్లీ జైలుకెళ్లే పరిస్థితి వచ్చింది. విద్వేష ప్రసంగాన్ని, రెచ్చిపోయి చేసే ప్రకటనల్ని తేలిగ్గా తీసుకోవద్దని ఇటీవలే ఆదేశించింది సుప్రీంకోర్టు. సుమోటో కేసుగా స్వీకరించి ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో శిక్షలు అమలు చెయ్యాలంటూ ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు వార్నింగ్ కూడా ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..