Ram Charan: శ్రీనగర్‌కు చేరుకున్న రామ్ చరణ్.. ఫిల్మ్ టూరిజం చర్చలో పాల్గొననున్న మెగా హీరో

|

May 22, 2023 | 11:22 AM

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అట్టాహాసంగా ప్రారంభమైన G20 సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు సౌత్ ఇండియా స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సదస్సులో పాల్గొనడానికి శ్రీనగర్ కు చేరుకున్నారు. ఫిల్మ్ టూరిజం చర్చలో చరణ్ పాల్గొంటారు.

Ram Charan: శ్రీనగర్‌కు చేరుకున్న రామ్ చరణ్.. ఫిల్మ్ టూరిజం చర్చలో పాల్గొననున్న మెగా హీరో
Ram Charan At Srinagar
Follow us on

జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లో G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్‌ అట్టాహాసంగా ప్రారంభమైంది. సాయుధ భద్రతా దళాల పహారాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ సమావేశంలో విదేశీ ప్రతినిధులతో పాటు పలువురు సెలబ్రెటీలు  కూడా పాల్గొంటున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు సౌత్ ఇండియా స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సదస్సులో పాల్గొనడానికి శ్రీనగర్ కు చేరుకున్నారు. ఫిల్మ్ టూరిజం చర్చలో చరణ్ పాల్గొంటారు.

ఫిల్మ్ టూరిజం, ఎకో ఫ్రెండ్లీ టూరిజంపై చర్చించనున్న చరణ్ 

ఈ సమావేశంలో ఫిల్మ్ టూరిజం, ఎకో ఫ్రెండ్లీ టూరిజంపై చర్చించనున్నారు. అంతర్జాతీయ సదస్సులో  జమ్మూ కాశ్మీర్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు.  జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్.. ఈ మూడు రాష్ట్రాలు ఫిల్మ్ టూరిజం పరంగా చాలా ముఖ్యమైనవి. G-20 సమావేశంలో మూడు రాష్ట్రాలకు సినిమా షూటింగ్ కు సహాయపడే సింగిల్ విండోను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ధర్మం, నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు..  

ఫిల్మ్ టూరిజం పాలసీపై జరిగే చర్చలో ధర్మ, నెట్‌ఫ్లిక్స్, ఫిక్కీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు చివరి రోజున,.. ప్రతినిధులందరూ శ్రీనగర్ నగరంలోని వివిధ ప్రాంతాలను కూడా సందర్శిస్తారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రం 

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అట్టాహాసంగా ప్రారంభమైన G20 సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. శ్రీనగర్ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో ప్రతినిధులు సింగపూర్ నుంచి విచ్చేసినట్టు అధికారులు చెప్పారు. 2019వ సంవత్సరం ఆగస్టులో కేంద్రం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి, రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత ఈ ప్రాంతంలో అంతర్జాతీయ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి.

పాకిస్తాన్ ఈ సదస్సును బహిష్కరిస్తున్నట్లు అంతర్జాతీయంగా ప్రచారం చేసినప్పటికీ అనేక దేశాల ప్రతినిధులు మూడు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు. అయితే చైనా, టర్కీ , సౌదీ అరేబియా దేశాలు మాత్రమే ఈ సదస్సుకు దూరంగా ఉన్నాయి.

కశ్మీర్ అందాలను చివరి రోజున వీక్షించనున్న అతిథులు  

ఈ సమావేశంలో ఫిల్మ్ టూరిజం , ఫిల్మ్ టూరిజం పాలసీ అవకాశాలపై ప్రత్యేక సెషన్‌లు కూడా జరగనున్నాయి. మూడు రోజుల ఈ సదస్సులో చివరి రోజున  అతిథులందరూ పోలో వ్యూ, జీలం రివర్ ఫ్రంట్ , శ్రీనగర్ నగర్ లోని ఇతర ప్రదేశాలను కూడా సందర్శించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..