Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan: బంగారం, డైమండ్స్ తో ఎకో రాఖీలను తయారు చేసిన వ్యాపారవేత్త .. ధర ఎంతంటే

దేశంలోని మార్కెట్ లో అందమైన రకరకాల రాఖీలు సందడి చేస్తున్నాయి. రూ.10 నుంచి లక్షలు విలువ జేసే రాఖీలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ కు చెందిన ఓ డిజైనర్ తన సృజనాత్మకతకు పదును పెట్టి.. సరికొత్త రాఖీలను తయారు చేశాడు.

Raksha Bandhan: బంగారం, డైమండ్స్ తో ఎకో రాఖీలను తయారు చేసిన వ్యాపారవేత్త .. ధర ఎంతంటే
Diamond Rakhis
Follow us
Surya Kala

| Edited By: Team Veegam

Updated on: Aug 10, 2022 | 6:27 PM

Raksha Bandhan: హిందూ సాంప్రదాయ పండగల్లో ఒకటి రాఖీపండగ. ఈ పర్వదినాన్ని సోదర-సోదరీ బంధానికి గుర్తుగా జరుపుకుంటారు. రాఖీ పండగ సందర్భంగా ప్రతి సోదరి తన సోదరునికి రాఖీ కట్టాలని కోరుకుంటుంది. అందుకు అందమైన రాఖీని ఎంపిక చేసుకుంటుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని మార్కెట్ లో అందమైన రకరకాల రాఖీలు సందడి చేస్తున్నాయి. రూ.10 నుంచి లక్షలు విలువ జేసే రాఖీలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ కు చెందిన ఓ డిజైనర్ తన సృజనాత్మకతకు పదును పెట్టి.. సరికొత్త రాఖీలను తయారు చేశాడు.

గుజరాత్‌కు చెందిన డిజైనర్ రాఖీలను దారం, విలువైన రాళ్లను ఉపయోగించి ప్రత్యేకమైన ‘డైమండ్ రాఖీ’ని రూపొందించాడు. ఈ రాఖీల స్పెషల్ ఏమిటంటే.. వీటిని రీసైకిల్ చేయవచ్చునని పేర్కొన్నాడు. గుజరాత్‌కు చెందిన వ్యాపారి విలువైన ఆభరణాలే కాదు.. బంగారాన్ని ఉపయోగించి ‘డైమండ్ రాఖీ’లను తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం అలోచించి సరికొత్తగా ఎకో రాఖీలను తయారు చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ ANI తెలిపింది. ఈ ఎకో రాఖీ ధర సుమారు రూ. 3,000 నుంచి రూ. 8,000 వరకు ఉంటుందని తయారీదారు చెప్పారు. ఈ పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా తయారు చేసిన ఎకో రాఖీలను రీసైకిల్ చేసిన బంగారంతో తయారు చేసామని, డిజైన్ లో  డైమండ్స్ ను  ఉపయోగించినట్లు రాఖీ తయారీదారు వ్యాపారవేత్త రజనీకాంత్ చాచంద్ ANI కి చెప్పారు. ఈ డైమండ్ రాఖీలను గుజరాత్‌లోని సూరత్ నగరంలో వ్యాపారవేత్త రజనీకాంత్ చాచంద్ విక్రయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సంవత్సరం రాఖీపండగను తోబుట్టువుల మధ్య ప్రేమకు చిహ్నంగా ఆగస్టు 11 న జరుపుకోనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
హీరో శర్వానంద్ ముద్దుల కూతురిని చూశారా? వీడియో ఇదిగో
హీరో శర్వానంద్ ముద్దుల కూతురిని చూశారా? వీడియో ఇదిగో
హాఫ్ సెంచరీతో చెలరేగిన లివింగ్ స్టోన్.. గుజరాత్‌ టార్గెట్ 170
హాఫ్ సెంచరీతో చెలరేగిన లివింగ్ స్టోన్.. గుజరాత్‌ టార్గెట్ 170
కాపీక్యాట్స్..! వెండితెర కంటే ముందే సెల్లుతెరపైకి మూవీ..
కాపీక్యాట్స్..! వెండితెర కంటే ముందే సెల్లుతెరపైకి మూవీ..
ఈ మొక్కను ఇంట్లో పెంచితే ధనప్రాప్తి ఖాయం!
ఈ మొక్కను ఇంట్లో పెంచితే ధనప్రాప్తి ఖాయం!
తాగునీటిలో చిటికెడు ఉప్పు కలిపి చూడండి..! మిరాకిల్ జరగుతుంది..!
తాగునీటిలో చిటికెడు ఉప్పు కలిపి చూడండి..! మిరాకిల్ జరగుతుంది..!
వక్ఫ్‌ బిల్లుపై వాడివేడిగా చర్చ.. మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు
వక్ఫ్‌ బిల్లుపై వాడివేడిగా చర్చ.. మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు