Rahul Gandhi: ట్రక్కులో ప్రత్యక్షమైన రాహుల్‌గాంధీ.. ఎందుకు వెళ్లారంటే

|

May 24, 2023 | 4:29 AM

భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎవరూ ఊహించని విధంగా ఓ ట్రక్కులో ప్రత్యక్షమయ్యారు. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఆయన.. మార్గమధ్యంలోనే కారు దిగారు. ఆ తర్వాత ఓ ట్రక్కు ఎక్కి అందులోని ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది.

Rahul Gandhi: ట్రక్కులో ప్రత్యక్షమైన రాహుల్‌గాంధీ.. ఎందుకు వెళ్లారంటే
Rahul Gandhi In Truck
Follow us on

భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎవరూ ఊహించని విధంగా ఓ ట్రక్కులో ప్రత్యక్షమయ్యారు. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఆయన.. మార్గమధ్యంలోనే కారు దిగారు. ఆ తర్వాత ఓ ట్రక్కు ఎక్కి అందులోని ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది. అర్థరాత్రి సమయంలో మీడియాకు, కార్యకర్తలకు తెలియకుండా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అర్థరాత్రి ట్రక్కు ప్రయాణం చేశారు రాహుల్ గాంధీ. లారీలో డ్రైవర్‌ పక్కన కూర్చోవడం, ఓ దాబా వద్ద డ్రైవర్లతో మాటామంతీ తదితర దృశ్యాలను కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసింది.

ట్రక్కు డ్రైవర్ల సమస్యలను తెలుసుకునేందుకు లారీ ఎక్కిన రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి చండీగఢ్‌ వరకు ప్రయాణించారు. దేశవ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది లారీ డ్రైవర్లు ఉన్నారు. వారికి ఆయా సమస్యలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వారి ‘మన్‌కీ బాత్’ విన్నారు’ అని కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అయితే లారీ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు సాధ్యమైనంత మేరకప కృషి చేస్తానని రాహుల్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. తన తల్లి సోనియా గాంధీని కలిసేందుకు సిమ్లా వెళ్తుండగా.. ట్రక్కు డ్రైవర్ల సమస్యలు వినేందుకు రాహుల్ ఈ ప్రయాణం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు కర్ణాటక ఎన్నికల సమయంలోనూ ఆయన బెంగళూరులో ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం