Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రకు సర్వం సిద్ధం.. ఈ రాష్ట్రాల మీదుగా పర్యటించనున్న రాహుల్..
భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇవాళ మణిపుర్‌లోని తౌబాల్ జిల్లాలో ఈ యాత్ర మొదలుకానుంది. 15 రాష్ట్రాల్లో దాదాపు 6,713 కిలోమీటర్ల మేర కొనసాగి.. మార్చి 20న ముంబైలో ముగియనుంది. భారత్ జోడో యాత్ర ఇచ్చిన స్ఫూర్తి, ఉత్సాహంతో రాహుల్ గాంధీ.. మరో యాత్రకు సిద్ధమయ్యారు. భారతదేశంలోని దక్షిణ దిక్కున చిట్టచివర్లో ఉన్న కన్యాకుమారి నుంచి.. ఉత్తరాన ఉన్న కాశ్మీర్ వరకు సాగించిన మొదటి యాత్రకు భారత్ జోడో అని పేరు పెట్టారు.

ఇక.. దేశంలోని తూర్పున ఉన్న మణిపూర్ నుంచి పశ్చిమ దిక్కున ఉన్న ముంబై వరకు కొనసాగుతున్న రెండో యాత్రకు.. భారత్ జోడో న్యాయ్ యాత్రగా నామకరణం చేశారు. అయితే.. ముందుగా నిర్ణయించినట్లు మణిపుర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాకుండా.. తౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు గ్రౌండ్ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ మణిపుర్‌లో మొదలై మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. 66 రోజుల పాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.
గతంలో చేసిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర. రోజుకు సుమారు 20 కిలోమీటర్లు నడిచారు రాహుల్. కానీ.., ఈ భారత్ న్యాయ్ యాత్ర.. ప్రధానంగా బస్సు యాత్ర అయినప్పటికీ.. ప్రతీ రోజు మధ్య, మధ్యలో పాదయాత్ర జరుగుతుంది. ముఖ్యంగా.. ప్రజల నుంచి స్పందన ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పాదయాత్ర ఉంటుంది. యాత్ర మార్గంలో.. చిన్న చిన్న బహిరంగ సభలను నిర్వహిస్తారు. వివిధ వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ మమేకమవుతారు. అంతేకాదు.. ఈ యాత్రలో భాగంగా దేశంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను ప్రస్తావిస్తారని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.
మొదట అనుకున్నట్లుగా.. 14 రాష్ట్రాల మీదుగా.. 6,200 కి.మీ దూరం యాత్ర చేపట్టాల్సి ఉండగా.. చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ముందు అనుకున్న యాత్ర మార్గంలో లేని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చేర్చడంతో పాటు.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరింత దూరం యాత్ర సాగించేలా వ్యూహాత్మకంగా మార్పులు చేశారు. చందౌలీ దగ్గర ఉత్తర ప్రదేశ్‌లోకి ప్రవేశించి.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసి మీదుగా అమేథీ, రాయ్ బరేలీ చేరుకుంటారు. అలానే.. సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎంపీగా ఉన్న ఆయన పాత సీటు అమేథీలో కూడా యాత్ర సాగిస్తారు రాహుల్.
లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా రాహుల్‌గాంధీ.. భారత్ న్యాయ్ యాత్ర కొనసాగనుంది. అయితే.. ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి.. రాహుల్ చేపట్టనున్న ఈ భారత్ న్యాయ్ యాత్ర.. లోక్‌సభ ఎన్నికల్లో.. ఎంత మేర పార్టీకి మేలు చేస్తుందో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..