Rahul Gandhi US Tour: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ‘అనూహ్య’ ఫలితాలు.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Jun 02, 2023 | 11:13 AM

Rahul Gandhi US Visit: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అధికార, విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. అయితే కేంద్రంలో మోదీ హ్యాట్రిక్ విజయం నమోదుచేసుకోవడం తథ్యమని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..

Rahul Gandhi US Tour: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ‘అనూహ్య’ ఫలితాలు.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
Rahul Gandhi
Follow us on

Rahul Gandhi US Visit: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అధికార, విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. అయితే కేంద్రంలో మోదీ హ్యాట్రిక్ విజయం నమోదుచేసుకోవడం తథ్యమని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రానున్నాయని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించే సత్తా విపక్ష ఐక్య కూటమికి ఉందని ధీమా వ్యక్తంచేశారు. వాషింగ్టన్‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో జర్నలిస్టులతో ముచ్చటించిన రాహుల్ గాంధీ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సాధించే ఫలితాలు ఓ రకంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు.

లెక్కలు వేసి చూస్తే.. విపక్ష ఐక్య కూటమి సొంత బలంతో బీజేపీని ఓడించడం సాధ్యమేని తేటతెల్లం అవుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పలు విపక్షాలతో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. విపక్షాల మధ్య సఖ్యత ఉందని.. విపక్షాలన్నిటితో తాము మాట్లాడుతున్నట్లు చెప్పారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా విపక్ష ఐక్య కూటమి ఏర్పాటు సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. పలు వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

ప్రాణహానిని లెక్క చేయను..

తన పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఇది తనకు గిఫ్ట్ లాంటిదని అభిప్రాయపడ్డారు. ఇది తనకు మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సరిగ్గా ఆలోచించకుండా.. తనకు ఈ గిఫ్ట్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. ప్రాణహానిని తాను లెక్కచేయనన్న రాహుల్ గాంధీ.. తన నాన్నమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ నుంచి దీన్ని నేర్చుకున్నానని చెప్పారు.

ముస్లీం లీగ్ లౌకిక పార్టీ..

కాగా కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తుపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రాహుల్ గాంధీ.. ముస్లీం లీగ్ పూర్తిగా లౌకిక పార్టీగా అభిప్రాయపడ్డారు. ముస్లీం లీగ్‌లో లౌకికత్వానికి వ్యతిరేకమైన అంశం ఏదీ లేదని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి