ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది.. రాహుల్ గాంధీ

| Edited By: Anil kumar poka

Aug 29, 2020 | 11:21 AM

దేశ ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందనికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు, లోపభూష్టమైన జీఎస్టీ,, విఫల లాక్ డౌన్.. ఈ మూడు కారణాలు దేశాన్ని అధోగతి పాల్జేశాయని ఆయన ట్వీట్ చేశారు.

ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది.. రాహుల్ గాంధీ
Follow us on

దేశ ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందనికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు, లోపభూష్టమైన జీఎస్టీ,, విఫల లాక్ డౌన్.. ఈ మూడు కారణాలు దేశాన్ని అధోగతి పాల్జేశాయని ఆయన ట్వీట్ చేశారు. కరోనా వైరస్, లాక్ డౌన్ భగవంతుని ‘ఇచ్చ్’ అంటూ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యను ఆయన ప్రస్తావిస్తూ.. ఇవి మన తప్పిదాలే అన్నారు. ముందు చూపు లేని విధానాలని దుయ్యబట్టారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం మేల్కొనాలని, ఎకానమీ మళ్ళీ గాడిన పడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో యోచించాలని రాహుల్ సూచించారు.

ఆర్థిక  మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 27 న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ పరిస్థితి దేవుడి ‘శాపం’ గా అభివర్ణించారు. ఈ పాండమిక్ కారణంగా 2.35 లక్షల కోట్ల తగ్గుదల ఏర్పడిందని ఆమె చెప్పారు. రాష్ట్రాలకు పెద్దగా చెల్లింపులు జరపలేమని అన్యాపదేశంగా వ్యాఖ్యానించారు.