Rahul Gandhi: మొన్న రైల్వే కూలీగా.. ఇప్పుడు రైల్వే ప్యాసింజర్‌గా..

దేశంలో ఈ ఏడాది చివరన ఐదు రాష్ట్రాల ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికే తమ స్పీడ్‌ను పెంచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జోష్ మీద ఉన్నారు. దేశంలోని వివిధ చోట్ల ప్రజల్ని కలుస్తూ ముందుకు సాగుతున్నారు. మొన్న కూలి అవతారమెత్తిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఓ రైలులో ప్యాసింజర్‌లా ప్రయాణించి అందిరినీ ఆశ్యర్యపరిచారు.

Rahul Gandhi: మొన్న రైల్వే కూలీగా.. ఇప్పుడు రైల్వే ప్యాసింజర్‌గా..
Rahul Gandhi

Updated on: Sep 25, 2023 | 10:46 PM

దేశంలో ఈ ఏడాది చివరన ఐదు రాష్ట్రాల ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికే తమ స్పీడ్‌ను పెంచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జోష్ మీద ఉన్నారు. దేశంలోని వివిధ చోట్ల ప్రజల్ని కలుస్తూ ముందుకు సాగుతున్నారు. మొన్న కూలి అవతారమెత్తిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఓ రైలులో ప్యాసింజర్‌లా ప్రయాణించి అందిరినీ ఆశ్యర్యపరిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాహుల్ గాంధీ.. పార్టీ నేతలతో కలిసి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ నుంచి రాయ్‌పూర్ వరకు ఇంటర్ సిటీ రైల్లో ప్రయాణించారు. అయితే ఈ సందర్భంగా పలువురు ఆయనతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఎర్రటి చొక్కా వేసుకొని నెత్తిన లగేజ్ పెట్టుకొని మోసిన దృశ్యాలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

అంతేకాదు రైల్వే కూలీలు ధరించేటటువంటి బ్యాడ్జీని ధరించి అచ్చం కూలీలాగే కనిపించి అందరిని ఆశ్యర్యపరిచారు. అలాగే రైల్వే కూలీల కష్టసుఖాలను సైతం అడిగి తెలుసుకోనున్నారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన గృహ నిర్మాణాలకు సంబంధించిన కార్యక్రమంలో సైతం రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా కుల గణనను కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్‌ చేశారు. అయితే గడిచిన కొన్ని నెలల్లో రాష్ట్రంలో 2,600 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసిందని ఆరోపణలు చేశారు. అలాగే దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, తెలంగాణలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహించే యోచన చేస్తున్నట్లు జోరుగా ప్రచారాలు జరిగాయి. అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ ప్రస్తావన రాకపోవడంతో.. షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం అవుతుంది.

ఇవి కూడా చదవండి