మహిళా టీచర్‌పై దాడి .. ! విద్యార్థులా వీధి రౌడీలా..?

విద్యాబుద్దులు నేర్పించే గురువుతోనే విద్యార్థులు విధి రౌడీల్లా రెచ్చిపోయి ప్రవర్తించారు. మహిళా టీచర్‌ను చుట్టుముట్టిన  స్టూడెంట్స్ ఆమెపై దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలిలో చోటుచేసుకుంది. రాయ్‌ బరేలీలోని గాంధీ సేవా నికేతన్‌లో అనాథ పిల్లల కోసం పనిచేస్తున్న మమతా దూబేపై ఈ నెల 11న (నవంబర్‌) దాడి జరిగింది. విద్యార్థులంతా కూడబల్లుకుని గుంపులుగా చేరి ఆమెపై దాడి చేశారు.  రిగిన ఘటనపై బాధితురాలు టీచర్‌ మమతా దూబే మర్నాడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు […]

మహిళా టీచర్‌పై దాడి .. ! విద్యార్థులా  వీధి రౌడీలా..?
Follow us

|

Updated on: Nov 13, 2019 | 6:42 PM

విద్యాబుద్దులు నేర్పించే గురువుతోనే విద్యార్థులు విధి రౌడీల్లా రెచ్చిపోయి ప్రవర్తించారు. మహిళా టీచర్‌ను చుట్టుముట్టిన  స్టూడెంట్స్ ఆమెపై దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలిలో చోటుచేసుకుంది. రాయ్‌ బరేలీలోని గాంధీ సేవా నికేతన్‌లో అనాథ పిల్లల కోసం పనిచేస్తున్న మమతా దూబేపై ఈ నెల 11న (నవంబర్‌) దాడి జరిగింది. విద్యార్థులంతా కూడబల్లుకుని గుంపులుగా చేరి ఆమెపై దాడి చేశారు.  రిగిన ఘటనపై బాధితురాలు టీచర్‌ మమతా దూబే మర్నాడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేసింది. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటుండగా తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా ..వారంతా  కలిసి తనపై దాడి చేశారని మమతా పోలీసులకు తెలిపారు. విద్యార్థులు టీచర్‌పై దాడి చేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చుట్టూ చేరిన విద్యార్థులు..ఆమెను రెచ్చగొట్టేలా మాట్లాడారు.  ఆమె హ్యాండ్‌ బ్యాగును విసిరేశారు. ఆమె వెళ్లి ఆ బ్యాగును తెచ్చుకుంది. మళ్లీ అదే విద్యార్థి ఓ ప్లాస్టిక్‌ కుర్చీతో ఆమెను కొట్టాడు. ఇది జరుగుతున్నంత సేపు మిగితా విద్యార్థులు పట్టించుకోలేదని… ఈ విషయాన్ని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని మమతా దూబే ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో నెటిజన్లు విస్తుపోతున్నారు. విద్యార్థుల ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?