Amarinder Singh: సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేసినా వదలం.. కొత్త పార్టీపై అమరీందర్ సింగ్ కీలక ప్రకటన

| Edited By: Anil kumar poka

Dec 23, 2021 | 6:48 PM

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తు్న్న వేళ ఆ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఏర్పాటు కావడం ఖాయమయ్యింది.

Amarinder Singh: సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేసినా వదలం.. కొత్త పార్టీపై అమరీందర్ సింగ్ కీలక ప్రకటన
Amarinder Singh
Follow us on

Amarinder Singh New Party: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఏర్పాటు కావడం ఖాయమయ్యింది. త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభించిన తర్వాత తమ పార్టీ పేరు, చిహ్నంను ప్రకటించనున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నవ్‌జోత్ సింగ్ సిద్ధు ఎక్కడి నుంచి పోటీ చేసినా.. తాము కూడా అక్కడి నుంచి పోటీ చేస్తామని స్పష్టంచేశారు. తన కొత్త పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని మొత్తం 117 స్థానాల్లోనూ తాము పోటీచేస్తామని అమరీందర్ సింగ్ స్పష్టంచేశారు. సీట్ల సర్దుబాట్లు ఉండే అవకాశముందని.. లేని పక్షంలో తమ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా బరిలోకి దిగుతుందని చెప్పారు. అదే సమయంలో బీజేపీ, ఇతర చిన్న పార్టీలతో పొత్తులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించేందుకు ఐక్య కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి ఇతర పార్టీలతో చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు. వ్యవసాయ చట్టాల వివాదంపై చర్చించేందుకు గురువారంనాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు వెల్లడించారు. తన వెంట 25-30 మందిని తీసుకెళ్లి అమిత్ షాతో కలుస్తానని తెలిపారు.

సిద్ధూకు ఏమీ తెలీదు.. నోటికొచ్చింది మాట్లాడటమే అతనికి తెలుసంటూ అమరీందర్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు తెలిపారు. కేంద్రంతో కలిసి పనిచేయకపోతే రాష్ట్రం పెద్దగా చేయగలిగింది ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. సుపరిపాలన అంటే ఏంటో సిద్ధూకు తెలుసని తాను భావించడంలేదన్నారు. సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచే పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతూ వచ్చిందన్నారు.

పంజాబ్ సరిహద్దులో బీఎస్‌ఎఫ్ దళాల అధికార పరిధిని 50 కి.మీల దూరం వరకు విస్తృతం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమరీందర్ సింగ్ సమర్థించారు. రాష్ట్ర భద్రతకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.

అమరీందర్ సింగ్‌పై సిద్ధూ విమర్శలు..

కాగా కేవలం తన వ్యక్తిగత స్వార్థంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని పీసీసీ చీఫ్ సిద్ధూ ఆరోపించారు.

Also Read..

Vijaya Sai Reddy: చంద్రబాబు కుట్రకు భయపడే పట్టాభి విదేశాలకు పారిపోయాడు: విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Pakistan: సైన్యం ముందు తలవంచిన ఇమ్రాన్ ఖాన్.. ఐఎస్ఐ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్ ఖరారు!