Punjab CM: రైతులకు అండగా పంజాబ్ సర్కార్.. నిరసనల్లో చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు!

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిన నిరసనలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది.

Punjab CM: రైతులకు అండగా పంజాబ్ సర్కార్.. నిరసనల్లో చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు!
Punjab Cm

Updated on: Dec 11, 2021 | 8:37 PM

Appointment letters to farmers: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిన నిరసనలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రకటించిన సంగతి తెలసిందే. ఈ నేపపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలలోని 11 మంది సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి రణ్‌దీప్‌ సింగ్‌ నాభా శనివారం రైతు కుటుంబాలలోని 11 మంది సభ్యులను నియామక పత్రాన్ని అందించారు. రైతుల కుటుంబాలను ఆదుకోవాలన్న నిబద్ధతను నెరవేరుస్తూ పంజాబ్ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు సీఎంవో కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. రైతులకు వ్యతిరేకంగా నిరసనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది రైతుల కుటుంబ సభ్యులకు క్లార్క్ జాబ్ నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రైతులే వెన్నెముక అని అభివర్ణించిన ముఖ్యమంత్రి, బాధిత కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బూటా సింగ్, మనీష్ కుమార్, అమృత్‌పాల్ కౌర్, మన్‌ప్రీత్ కౌర్, కమల్‌ప్రీత్ సింగ్, నిర్మల్ సింగ్, గుర్విందర్ కౌర్, బక్షిష్ సింగ్, నరీందర్ సింగ్, దీక్షా మరియు గగన్‌దీప్ కౌర్ నియామకపత్రాలు ఇచ్చిన వారిలో ఉన్నారు.


ఢిల్లీ సరిహద్దుల నుంచి విజయం సాధించి తిరిగి వచ్చిన అన్నదాతలకు ఘనంగా స్వాగతం పలుకుతామని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ శుక్రవారం అన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ఐక్య కిసాన్ మోర్చా నాయకులకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఇది ప్రజల విజయమని, సమాజంలోని వివిధ వర్గాల ఐక్యత వల్లే మోడీ ప్రభుత్వం కఠిన చట్టాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని అన్నారు.

దాదాపు ఏడాది కాలంగా రైతుల డిమాండ్లను పట్టించుకోలేదని, అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు రైతుల గెలుపును క్యాష్ చేసుకోవాలని, ఎన్నికల కార్డుగా మలుచుకోవాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి చన్ని ఆరోపించారు. ఏడాదికి పైగా తమ సహనాన్ని పరీక్షిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని, నాయకులను దేశ రైతులు, ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు.

Read Also…  e-PAN Card: మీరు ఇంట్లో కూర్చొని e-PAN పొందవచ్చు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. నిమిషాల్లో పని అయిపోతుంది!