పంజాబ్ కాంగ్రెస్ లో పునర్వ్యవస్థీకరణ జరగవచ్ఛునన్న ఊహాగానాల నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ గురువారం పార్టీలోని కొంతమంది హిందూ నాయకులకు లంచ్ ఇచ్చారు. దాదాపు 20 మంది నేతలు దీనికి హాజరయ్యారు. మాజీ మంత్రి, అసమ్మతి నేత నవజ్యోత్ సింగ్ సిద్దు ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయి ముమ్మరంగా చర్చలు జరుపుతుండగా ఈ ముఖ్యమంత్రి ఇక్కడ లంచ్ ఇచ్చి వారిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అటు నవజ్యోత్ సింగ్, కేంద్ర పార్టీ నేతల మధ్య ఏ చర్చలు జరిగాయో తెలియదు గానీ…ఓ శాంతి ఫార్ములాను మాత్రం వారు రూపొందించినట్టు తెలిసింది. పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ.. పార్టీలో సిద్దుకు కీలక పదవినివ్వాలని సూచించినప్పటికీ..కెప్టెన్ అమరేందర్ సింగ్ అంగీకరించలేదు.మరో వైపు రాష్ట్ర పార్టీ శాఖ అధ్యక్షునిగా మనీష్ తివారీ లేదా మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా నియమితులు కావచ్చునని వీరి పేర్లు వినవస్తున్నాయి.
వీరికి అమరేందర్ సింగ్ మద్దతు ఉంది. అయితే పార్టీలోని కొంతమంది హిందూ నేతలే ఈయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కోవిద్ పాండమిక్ ని ఈ ముఖ్యమంత్రి అదుపు చేయలేకపోయారని వారు అంటున్నారు. ఏమైనా.. నవజ్యోత్ సింగ్ సిద్దుకి పార్టీలో కీలక పదవి లభించవచ్ఛునన్న ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి. పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ లో ముఠా కుమ్ములాటలు కూడా పెరిగాయి.. అయితే సీఎం అమరేందర్ సింగ్ పై కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలే బాహాటంగా అసమ్మతి గళాన్ని వినిపించడం విశేషం.
మరిన్ని ఇక్కడ చూడండి:పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.
బర్త్‌డే పార్టీలో సింహం చీఫ్ గెస్ట్..అదిరిపోయే ట్విస్ట్!వైరల్ అవుతున్న వీడియో :Lion as party video.