పంజాబ్ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు, రాత్రంతా ఆప్ ఎమ్మెల్యేల నిరసన

పంజాబ్ అసెంబ్లీలో నిన్న రాత్రంతా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విపక్ష ఆప్ ఎమ్మెల్యేలు సభలోనే నిరసనలతో గడిపారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అమలు చేయనున్న బిల్లు..

పంజాబ్ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు, రాత్రంతా ఆప్ ఎమ్మెల్యేల నిరసన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 20, 2020 | 10:06 AM

పంజాబ్ అసెంబ్లీలో నిన్న రాత్రంతా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విపక్ష ఆప్ ఎమ్మెల్యేలు సభలోనే నిరసనలతో గడిపారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అమలు చేయనున్న బిల్లు కాపీలను తమకు అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీటిని స్వాగతిస్తున్నామని, కానీ సర్కార్ వీటికి సంబంధించిన కాపీలను తమకు ఎందుకు ఇవ్వడంలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ డ్రాఫ్ట్ కాపీలు తమకు అందలేదన్నారు. అటు శిరోమణి అకాలీదళ్ కూడా అమరేందర్ సింగ్ ప్రభుత్వం ఈ బిల్లులను నిన్ననే సభలో ప్రవేశపెట్టాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ఎన్డీయే నుంచి ఈ పార్టీ వైదొలగిన సంగతి తెలిసిందే.. రైతు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం అమరేందర్ సింగ్ ఈ బిల్లు కాపీలను ఆప్ ఎమ్మెల్యేలకు ఎందుకు అందజేయలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.