కమల్‌నాథ్‌పై కత్తులు దూస్తున్న మహిళా సంఘాలు
రాజకీయాల్లో నోటినెప్పుడూ అదుపులో పెట్టుకుని ఉంచుకోవాలి... బోలెడంత అనుభవాన్ని వెనకేసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌కు ఆ విషయం తెలియకపోవడమే విచారకరం..

రాజకీయాల్లో నోటినెప్పుడూ అదుపులో పెట్టుకుని ఉంచుకోవాలి… బోలెడంత అనుభవాన్ని వెనకేసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌కు ఆ విషయం తెలియకపోవడమే విచారకరం.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.. అంతేకాకుండా కాంగ్రెస్‌పార్టీకి చిక్కులు తెచ్చింది.. దాబ్రా నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో కమల్‌నాథ్ ఓ మహిళా మంత్రిని ఐటం అంటూ సంబోధించారు.. సీనియర్ నేత ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమేమిటని పలువురు విస్తుపోయారు.. చాలా మందికి కోపం తెప్పించింది.. బీజేపీతో పాటు మహిళా సంఘలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి నిరసనగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో పాటు పలువురు నాయకులు రెండు గంటలపాటు మౌనదీక్ష కూడా చేపట్టారు. మహిళలు, దళితులను కించపరిచేలా కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నీచమైన మనస్తత్వానికి అద్దంపడుతున్నాయని శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ దుయ్యబట్టారు. అదలా ఉంచితే కమల్‌నాథ్ తీరుపై మహిళలు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. నోటిసులు పంపడానికి రెడీ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడానికి సమాయత్తమవుతోంది.