మహారాష్ట్ర గవర్నర్ పై మళ్ళీ శరద్ పవార్ ధ్వజం
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సీఎం ఉధ్ధవ్ థాక్రేకి రాసిన లేఖపై ఎన్సీపీ నేత శరద్ పవార్ కి ఆగ్రహం ఇంకా చల్లారలేదు. ఈ లేఖ మీద సాక్షాత్తూ హోమ్ మంత్రి అమిత్ షాయే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని పవార్ అన్నారు.

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సీఎం ఉధ్ధవ్ థాక్రేకి రాసిన లేఖపై ఎన్సీపీ నేత శరద్ పవార్ కి ఆగ్రహం ఇంకా చల్లారలేదు. ఈ లేఖ మీద సాక్షాత్తూ హోమ్ మంత్రి అమిత్ షాయే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని పవార్ అన్నారు. హోదాకు తగని వ్యక్తి పదవిలో కొనసాగడం సమంజసం కాదన్నారు. గవర్నర్ తన లెటర్ లో సెక్యులర్ వంటి పదాలను వాడకుండా ఉండాల్సిందని అమిత్ షా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆ మాటలే చాలుగా అన్నారు శరద్ పవార్. ఆత్మగౌరవం ఉన్నవారెవరూ ఉన్నతమైన పదవిలో ఉండబోరని ఆయన తీవ్రంగా పేర్కొన్నారు. ఇలాంటిగవర్నర్ ను రీకాల్ చేయాలని శివసేన వంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయన్నారు.