
స్నేహం ముసుగులో కాలనాగు దాగుంది. అదును చూసే కాటేందుకు సిద్ధంగా ఉంది. అది తెలియని ఆ అమాయకురాలు.. కాలనాగు నాంటి స్నేహితుడిని నమ్మింది. ఇదే ఛాన్స్ అనుకున్న ఆ దుర్మార్గుడు.. తినే పదార్థాల్లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అమ్మాయి అపస్మారకస్థితిలోకి జారుకోగానే తాను అనుకున్న పని చేశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 9 రోజుల పాటు ఆమెను నిర్బంధించి అత్యాచారం చేశాడు. చివరకు స్పృహలోకి వచ్చిన యువతి.. ఎలాగోలా ఆ కీచకుడి చెర నుంచి బయటపడింది. పంజాబ్‌లోని లుధియానాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
లుధియానాలోని హతుర్‌కు చెందిన జస్పాల్ సింగ్, బాధిత యువతి(26) ఇద్దరూ స్నేహితులు. అయితే, తన దుబాయ్ ట్రిప్ కోసం షాపింగ్ చేయడానికి సహాయం కావాలని, సెప్టెంబర్ 30వ తేదీన రాయికోట్‌కు రావాలని యువతిని కోరాడు. దాంతో స్నేహితుడే కదా అని నమ్మిన యువతి అతని కోసం రాయికోట్‌కు వెళ్లింది. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం.. మత్తు మందు ఇచ్చిన ఆహారాన్ని ఆమెతో తినిపించాడు. దాంతో యువతి అపస్మారకస్థితికి చేరుంది. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి యువతిని ఉత్తరప్రదేశ్‌లోని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. నాటి నుంచి 9 రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశాడు. అక్టోబర్ 8న యువతి స్పృహలోకి రాగా, ఆ కీచకుడి చెర నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలోనూ అతను యువతిపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. మొత్తానికి అతని చెర నుంచి తప్పించుకుని స్వగ్రామానికి వచ్చిన యువతి.. కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు, చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. జస్పాల్ సింగ్‌పై ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 342, 376 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..