Trishund Mayureshwar Ganpati: ప్రపంచలోనే ప్రసిద్ధి చెందిన గణపయ్య ఆలయం.. ఇక్కడి ప్రత్యేక ఏమిటో తెలుసా?
సాధారణంగా వినాయకుడి రూపం ఎలా ఉంటుంది ఒక తొండం, నాలుగు చేతులు పక్కన మూషక వాహనం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ఒక పురాతనమైన ఆలయంలో మాత్రం ప్రపంచంలో ఎక్కడా చూడని విఘ్నేశ్వరుడు మీకు కనిపిస్తారు. ఇక్కడ ఉన్న గణపయ్య మూడు తొండలు, ఆరు చేతులతో మయూరం మీద కూర్చుని ఉంటారు. ఇంతకు ఈ ఆలయం ఎక్కడుంది. దీని ప్రత్యేక ఏమిటో తెలుసుకుందాం పదండి.

పూణేలోని త్రిశుండ్ మయూరేశ్వర్ గణపతి ఆలయంలో మనం ప్రప్రంచంలోనే ఎక్కడా చూడని గణపయ్య విగ్రహాన్ని చూడవచ్చు. ఈ ఆలయం పూణే నగరంలోని ఒక అద్భుతమైన, చారిత్రక ఆలయం. ఇది సోమ్వార్ పేత్ ప్రాంతంలోని కమలా నెహ్రూ ఆసుపత్రి చౌక్ సమీపంలో ఉంది. ఈ ఆలయం పూణా పేష్వా కాలానికి చెందినది. ఈ ఆలయానికి దాదాపు 250-270 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆలయంలోని గణపతి విగ్రహం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇక్కడి వియానకుడు గణపతి మూడు తొండలు, ఆరు చేతులతో మయూరం మీద కూర్చుని ఉంటారు. అందుకే ఇక్కడి గణపయ్యను త్రిశుండ్ మయూరేశ్వర్ గణపతి అని పిలుస్తారు.

Mayureshwar Ganpati
ఈ ఆలయంలోని కొలువైఉన్న త్రిశుండ్ మయూరేశ్వర్ గణపతి మూడు తొండాలు కలిగి ఉంటారు. ఈ మూడు తొండాలు జీవితంలోని మూడు విభిన్న అంశాల( భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక మార్గం, మేధో జ్ఞానం) ఒకేసారి నిర్వహించగల గణేశుడి సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఇది కళ, జ్ఞానం, సమృద్ధి ప్రతీక పరిగణించబడుతుంది. ఇక్కడి గణపయ్య విగ్రహ ఆకృతి డెక్కన్ బాసాల్ట్ రాయితో నిర్మించబడింది, విగ్రహం నల్లటి బాసాల్ట్‌తో. రాజస్థాన్, మాల్వా, దక్షిణ భారతీయ శైలుల మిశ్రమం. ముఖ్య ద్వారంలో ద్వారపాలకులు, శివలింగాలు, విష్ణు, మయూరాలు, కాకులు, రైనోసిరాస్ (బ్రిటిష్ సైనికుడితో కట్టుబడినది – ప్లాసీ యుద్ధానికి సంబంధం) వంటి చెక్కటి శిల్పాలు ఉన్నాయి.
ఆలయ చరిత్ర..
18వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడింది. దీనిని ఆ కాలంలో సాధువు భీమ్జిగిరి గోసావి నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం 1754 లో స్టార్ట్ చేస్తే.. పూర్తి కావడానికి 16 ఏళ్లు పట్టింది. అంటే ఈ ఆలయం 1770లో పూర్తయింది. అయితే, ప్రస్తుతం ఈ ఆలయంలో ఉన్న విగ్రహం చాలా పాతదని నమ్ముతారు. ఆలయం నిర్మించబడటానికి చాలా సంవత్సరాల ముందే ఈ విగ్రహం కనుగొన్నట్టు తెలుస్తోంది. పురాణాల ప్రకారం, విఘ్నేశ్వర్ అనే ముని ఒకసారి భూమిలో పాతిపెట్టబడిన విగ్రహాన్ని కనుగొని దానిని బయటకు తీసుకువచ్చాడు. ఆ తరువాత, దీనిని పూణేలోని గణేశ భక్తులకు ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన ఆలయంలో ఉంచారు.
వీడియో చూడండి..
View this post on Instagram
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




