“ఎవరూ పదవీ విరమణ చేయాలని ఎప్పుడూ చెప్పలేదు”: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మూడు రోజుల సమావేశం చివరి రోజున, RSS చీఫ్ మోహన్ భగవత్ అనేక ముఖ్యమైన అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా 75 ఏళ్లు నిండిన వారు పదవి విరమణ చేయాలన్న నిబంధనలను ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోసిపుచ్చారు. 'పదవీ విరమణ' చేస్తారనే ఊహాగానాలకు ఆయన తెర దించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మూడు రోజుల సమావేశం చివరి రోజున, RSS చీఫ్ మోహన్ భగవత్ అనేక ముఖ్యమైన అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశ భద్రత కోసం, భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలన్నారు. ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలని ఆయన అన్నారు. అక్రమ చొరబాటు, మతమార్పిడిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా 75 ఏళ్లు నిండిన వారు పదవి విరమణ చేయాలన్న నిబంధనలను ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోసిపుచ్చారు. మోహన్ భగవత్ గురువారం (ఆగస్టు 28) విలేకరులతో మాట్లాడుతూ, “నేను పదవీ విరమణ చేస్తానని గానీ 75 ఏళ్లు నిండినప్పుడు మరొకరు పదవీ విరమణ చేయాలని గానీ నేను ఎప్పుడూ చెప్పలేదు..” అని స్పష్టం చేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. ఆసక్తికరంగా, మోదీకి 6 రోజుల ముందు మోహన్ భగవత్‌కు సెప్టెంబర్ 11న 75 ఏళ్లు నిండుతాయి. 75వ పుట్టినరోజు తర్వాత ‘పదవీ విరమణ’ చేస్తారనే ఊహాగానాలకు ఆయన తెర దించారు. ఆర్‌ఎస్‌ఎస్ 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సంఘ్ ఏమి చెబితే అది మేము చేస్తాము” అని మోహన్ భగవత్ అన్నారు.
’75 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ కావాలా?’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. జీవితంలో ఏ సమయంలోనైనా పదవీ విరమణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. సంఘ్ మనం పని చేయాలని కోరుకునేంత కాలం, సంఘ్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము” అని అన్నారు.
#WATCH | Delhi | On the question of 'Should Indian leaders retire at the age of 75 years', RSS chief Mohan Bhagwat says, "…I never said I will retire or someone should retire. In Sangh, we are given a job, whether we want it or not. If I am 80 years old, and Sangh says go and… pic.twitter.com/p8wq03IKYj
— ANI (@ANI) August 28, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




