నారాయణస్వామి రాజీనామాతో పుదుచ్చేరిలో అనిశ్చితి.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నిర్ణయంపై ఉత్కంఠ

లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేడీని తప్పించడం, తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో నారాయణ స్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

  • Balaraju Goud
  • Publish Date - 11:32 am, Tue, 23 February 21
నారాయణస్వామి రాజీనామాతో పుదుచ్చేరిలో అనిశ్చితి.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నిర్ణయంపై ఉత్కంఠ

Puducherry politics : పుదుచ్చేరి రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. బలపరీక్షకు కొన్ని రోజుల ముందు నుంచే రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేడీని తప్పించడం, తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో నారాయణ స్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

అసెంబ్లీ బల పరీక్షలో నారాయణస్వామి మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో సర్కార్‌ కుప్పకూలిపోయింది..
దీంతో నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసైకు రాజీనామా సమర్పించారు. అయితే,14మంది సభ్యుల మద్దతున్న ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌.. అధికారం చేపడుతుందని అనుకున్నారు. కానీ.. రెండు నెలల్లోనే ఎన్నికలు ఉండటం.. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేమని ప్రకటించింది ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూటమి.

సీఎం రాజీనామాతో ఇప్పుడు పుదుచ్చేరి రాజకీయాలు రసవత్తంగా మారాయి. తాజా పరిణామల నేపథ్యంలో లెప్ట్ నెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టిన తమిళిసై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ రాజీకాయ డ్రామా అంతా కేంద్ర పెద్దలకు తెలిసే జరుగుతోందని.. వారు చెప్పినట్టే గవర్నర్ చేస్తారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. దీనికే తమిళిసై మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఎన్నికల సమాయానికి పుదుచ్చేరి రాజకీయాలు మొత్తం కేంద్రంలో ఉన్న బీజేపీ నియంత్రణలో ఉన్నట్లే. మరోవైపు, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదని నారాయణ స్వామి భావిస్తే.. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని ఎల్‌జీని కోరే అవకాశాలు ఉంటాయి. అయితే, అసెంబ్లీలో విశ్వాసం కోల్పోయిన నేపథ్యంలో ఎల్‌జీ.. ఆయన సలహాను పరిగణలోకి తీసుకునే అవకాశం లేనట్టే. అయితే ఆమె నేరుగా ఆ నిర్ణయం తీసుకుంటారా..? లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ప్రతిపక్షాన్ని అడిగిన తరువాత నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి. కాగా, పుదుచ్చేరి తదుపరి రాజకీయ భవిష్యత్తు లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

Read Also..  Delhi violence: ఢిల్లీ ఎర్రకోట ఘటనలో మరో ఇద్దరు కీలక సూత్రధారుల అరెస్ట్.. విచారణ చేపట్టిన క్రైం బ్రాంచ్