Actor Vijay: సీఎం రంగస్వామితో విజయ్ భేటీ.. రానున్న మున్సిపల్ ఎన్నికల విషయంపై చర్చ..

|

Feb 05, 2022 | 6:18 PM

Actor Vijay: తమిళ నటుడు విజయ్ తో పాండిచ్చేరి సీఎం రంగస్వామి(CM Rangaswami) భేటీ అయ్యారు. నీలాంకరై లో ఉన్న తన స్వగృహంలో సీఎం రంగస్వామిని విజయ్ గౌరవార్థం కలిశారు.ఈ భేటీలో త్వరలో జరగనున్న..

Actor Vijay: సీఎం రంగస్వామితో విజయ్ భేటీ.. రానున్న మున్సిపల్ ఎన్నికల విషయంపై చర్చ..
Vijay And Cm Rangaswami
Follow us on

Actor Vijay: తమిళ నటుడు విజయ్ తో పాండిచ్చేరి సీఎం రంగస్వామి(CM Rangaswami) భేటీ అయ్యారు. నీలాంకరై లో ఉన్న తన స్వగృహంలో సీఎం రంగస్వామిని విజయ్ గౌరవార్థం కలిశారు.ఈ భేటీలో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు విజయ్ ఇంట్లో గంటపాటు సమావేశం జరిగినట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయాలు ,పుదుచ్చేరి లో సినిమా షూటింగ్ లపై ప్రధానం గా చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తమిళనాడు లో మున్సిపల్ ఎన్నికలలో విజయ్ మక్కళ్ ఇయక్కం పార్టీ పోటీ చేస్తున్న వివరాలను రంగస్వామి అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 19న చెన్నై సహా 219 కార్పొరేషన్లు, 138 మున్సిపాలిటీలు, 490 మునిసిపాలిటీలు, తమిళనాడులోని 649 పట్టణ స్థానిక సంస్థలకు, వార్డుల వారీగా ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 22న ఫలితాలు వెల్లడికానున్నాయి.

విజయ్ తన తాజా సినిమా ‘బీస్ట్’ షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, యోగి బాబు, అపర్ణా దాస్, లిల్లిపుట్ ఫరూఖీ, అంకుర్ అజిత్ వికల్, సతీష్ కృష్ణన్, జార్న్ సుర్రావ్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.

Also Read:

: అసెంబ్లీ ఎదురుగా రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం..