Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి తప్పిన ప్రమాదం.. యూపీలోని రాంపూర్‌కు వెళుతుండగా..
priyanka gandhi convoy accident : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ వెళుతుండగా ఆమె కాన్వాయ్‌లోని..
priyanka gandhi convoy accident : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ వెళుతుండగా ఆమె కాన్వాయ్‌లోని నాలుగు కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా మరణించిన నవరీత్ సింగ్ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ.. యూపీలోని రాంపూర్ నగరానికి బయలుదేరారు. ఈ క్రమంలో యూపీలోని హాపూర్ వద్ద ప్రియాంక గాంధీ కాన్వాయ్‌లోని నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రియాంక గాంధీతోపాటు ఆమె భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కార్లు దెబ్బతిన్నాయి.
Delhi: Congress leader Priyanka Gandhi is en route to Rampur, Uttar Pradesh
Visuals from the Sahibabad area pic.twitter.com/eBlKixVH45
— ANI (@ANI) February 4, 2021
Also Read: