భారత ప్రధాని, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి.. ఇందులో ఎవరికి ఎంత జీతం ఉంటుందో తెలుసా?

ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం మోడీతో ప్రమాణం చేయించారు. ప్రధానికి కల్పించిన సౌకర్యాలు ప్రత్యేకం. వారు అధికారిక ప్రభుత్వ నివాసంతో పాటు భద్రత కోసం ప్రత్యేక రక్షణ బృందాన్ని (SPG) పొందుతారు. ప్రభుత్వ వాహనాలు, విమానాల సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ పర్యటనల సమయంలో వారి వసతి, ఇతర ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.  అయితే..

భారత ప్రధాని, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి.. ఇందులో ఎవరికి ఎంత జీతం ఉంటుందో తెలుసా?
Prime Minister
Follow us

|

Updated on: Jun 10, 2024 | 7:13 PM

ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం మోడీతో ప్రమాణం చేయించారు. ప్రధానికి కల్పించిన సౌకర్యాలు ప్రత్యేకం. వారు అధికారిక ప్రభుత్వ నివాసంతో పాటు భద్రత కోసం ప్రత్యేక రక్షణ బృందాన్ని (SPG) పొందుతారు. ప్రభుత్వ వాహనాలు, విమానాల సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ పర్యటనల సమయంలో వారి వసతి, ఇతర ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.  అయితే భారత ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిల వేతం ఎంతో తెలుసుకుందాం.

ప్రధాని జీతం ఎంత?

దేశ ప్రధాని ప్రతినెలా రూ.1.66 లక్షల జీతం పొందుతారు. ఇందులో మూల వేతనం రూ.50 వేలు. రూ.3 వేలు ఖర్చు భత్యం రూపంలో ఉంటుంది. అదే సమయంలో పార్లమెంటరీ భత్యం రూ.45 వేలు. ఇది కాకుండా రోజుకు రూ.2 వేలు భృతి కూడా ఉంటుంది. భారతదేశంలో ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు వివిధ సౌకర్యాలు కూడా ఉంటాయి. పదవిని విడిచిపెట్టిన తర్వాత కూడా, వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇలా మొదటి ఐదేళ్లపాటు ప్రభుత్వ ఇల్లు, విద్యుత్, నీరు, ఎస్‌పీజీ సెక్యూరిటీ సౌకర్యాలు కూడా ఉంటాయి. లుటియన్స్ జోన్‌లో జీవితకాలం ఉచిత వసతి, జీవితాంతం ఉచిత వైద్య సహాయం, కార్యాలయం నుండి నిష్క్రమించిన తర్వాత మొదటి ఐదు సంవత్సరాలలో 14 మంది సెక్రటేరియల్ సిబ్బంది కూడా అందించబడుతుంది.

భారత రాష్ట్రపతి జీతం ఎంత ?

భారత రాష్ట్రపతికి అనేక అధికారాలున్నాయి. అతను, ఆమె భారత సాయుధ దళాల కమాండర్ చీఫ్. ప్రధానమంత్రితో సహా అనేక ముఖ్యమైన పదవులపై నియామకాలు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అంతే కాదు పార్లమెంట్ సమావేశాలను పిలిచి వాయిదా వేసే అధికారం కూడా ఉంది. రాష్ట్రపతికి తన జీతంతో పాటు అనేక రకాల అలవెన్సులు కూడా లభిస్తాయి. దేశ రాష్ట్రపతికి ప్రతినెలా రూ.5 లక్షల జీతం వస్తుంది. ఇది కాకుండా, వారు పన్ను పరిధిలోకి రాని అనేక అలవెన్సులను పొందుతారు. వారు ప్రపంచవ్యాప్తంగా రైలు, విమానంలో ఉచితంగా ప్రయాణించే హక్కును పొందుతారు. వీరికి వైద్యం, కార్యాలయ ఖర్చుల నిమిత్తం ఏటా రూ.లక్ష ఇందజేస్తారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఒక మాజీ రాష్ట్రపతి ప్రతి నెలా రూ. 1.5 లక్షల పెన్షన్ పొందుతారు. దీంతోపాటు ప్రభుత్వ గృహం, రెండు ఉచిత ల్యాండ్‌లైన్ ఫోన్లు, ఒక మొబైల్ ఫోన్, ఐదుగురు వ్యక్తిగత ఉద్యోగులను ఇస్తారు.

సీజేఐకి ఎంత జీతం వస్తుంది?

అధికారిక న్యాయ శాఖ ప్రకారం.. దేశ ప్రధాన న్యాయమూర్తి ప్రతి నెలా రూ. 2,80,000 జీతం ఉంటుంది. అదే సమయంలో పదవిని విడిచిపెట్టిన తర్వాత అంటే రిటైర్‌మెంట్‌ అయిన తర్వాత మాజీ CJI వార్షిక పెన్షన్ రూ. 16,80,000 ఉంటుంది. దీనితో పాటు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తికి ఒకేసారి 20 లక్షల రూపాయలను గ్రాట్యుటీగా అందజేస్తారు. పదవీ విరమణ తర్వాత అతను, అతని కుటుంబం కూడా సెంట్రల్ సివిల్ సర్వీసెస్‌లోని క్లాస్ వన్ అధికారి, అతని కుటుంబంతో సమానంగా వైద్య సదుపాయాలను పొందుతారు. అంతేకాకుండా భద్రతను కూడా ఏర్పాటు చేస్తారు. అదే సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి నెలకు రూ.2.50 లక్షలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2.50 లక్షల జీతం లభిస్తుంది. ఇది కాకుండా హైకోర్టు న్యాయమూర్తికి ప్రతి నెలా రూ.2.25 లక్షల జీతం వస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!