PM Narendra Modi: ప్రధాని మోదీ కేదార్నాథ్ పర్యటన.. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు: బీజేపీ నేత తరుణ్ చుగ్

|

Nov 03, 2021 | 9:07 PM

Kedarnath Temple: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 5న (శుక్రవారం) కేదర్నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారని భారతీయ జనతా పార్టీ

PM Narendra Modi: ప్రధాని మోదీ కేదార్నాథ్ పర్యటన.. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు: బీజేపీ నేత తరుణ్ చుగ్
Pm Narendra Modi
Follow us on

Kedarnath Temple: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 5న (శుక్రవారం) కేదర్నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కేదర్నాథ్ ధామ్ మంచ్‌దార్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారని బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రార్థనల అనంతరం మోదీ శ్రీ సద్గురు ఆది శంకరాచార్యుల సమాధిని సందర్శిస్తారని.. అనంతరం ఆయన విగ్రహం ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారని తరుణ్ చుగ్ తెలిపారు. ప్రధానమంత్రి కేదార్‌నాథ్ ధామ్ యాత్ర నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధువులు, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, ఇతర నాయకులు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.

దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చెక్కుచెదరకుండా ఉంచేందుకు.. అదేవిధంగా ప్రధానమంత్రి కేధర్నాథ్ యాత్రలో భాగంగా.. ఆది శంకరాచార్యులను స్మరించుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. దీంతో శంకరాచార్యుల అఖండ యాత్రలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన 87 మంచ్‌దార్లలో సాధువులు, మహామండలేశ్వరులు, ఆయా నిర్వాహకులు కూడా పాల్గొననున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక చైతన్యానికి ఈ కార్యక్రమాలతో కొత్త నిర్వచనాన్ని తెలపనున్నట్లు వివరించారు. దేశంలో ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పడానికి ఆది శంకరాచార్యులు చేసిన అద్భుతమైన పనిని దేశప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. దీనికోసం భారతీయ జనతా పార్టీ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.

ప్రధాని మోదీ కేధర్నాథ్ పర్యటనను.. చూసేలా పలు దేవాలయాల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం పౌరుల్లో ఆధ్యాత్మిక చైతన్యం రగిలిస్తుందని అభిప్రాయపడ్డారు. 2013లో సంభవించిన భయంకరమైన వరదల తర్వాత.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కెదర్నాథ్ ధామ్ పునర్నిర్మాణం జరిగిందన్నారు. ప్రతి ప్రాజెక్ట్‌ను ఆయన సమీక్షించడంతోపాటు పర్యవేక్షిస్తూ వచ్చారన్నారు. జగద్గురు ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త , వేదాంతవేత్త. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారు. ఈ క్రమంలో హిందూమతాన్ని ప్రచారం చేసిన త్రిమతాచార్యులలో ప్రథములు.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కేదార్నాథ్‌లో భద్రతా దళాను మోహరించారు. దీంతోపాటు ఆలయాన్ని 8 క్వింటాల పూలతో అలంకరించారు.

Also Read:

Crime News: వృద్ధ దంపతుల దారుణ హత్య.. కత్తులతో గొంతు కోసి పరారైన దుండగులు..

Viral Video: వీళ్లను ఏమనాలి.. టపాసులు కాల్చి పెట్రోల్ బంకుపై విసిరిన ఆకతాయిలు.. ఆ తర్వాత ఏమైందంటే..?