Prime Minister Narendra Modi West Bengal Tour : ప్రధాని నరేంద్ర మోదీ రేపటి తన బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నారు. బదులుగా మోదీ రేపు దేశంలో కరోనా పరిస్థితులపై నిర్వహించబోతోన్న ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఇలాఉండగా, కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోన్న వేళ ప్రధాని నరేంద్రమోదీ కరోనా కట్టడికి నాలుగు రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా, దాని లభ్యతకు సంబంధించి ఉన్నత స్థాయి వర్చువల్ సమీక్ష చేశారు. ఆక్సిజన్ అన్ని రాష్ట్రాల్లోనూ సులభంగా లభ్యమయ్యే మార్గాలపై ఈ సమావేశంలో ప్రధాని చర్చించారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచేందుకు గత కొన్ని వారాలుగా చేపట్టిన ప్రయత్నాలను అధికారులు మోదీకి వివరించారు. కరోనా రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ విషయంలో బహుముఖంగా పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రధాని నొక్కి వక్కాణించారు. ఆక్సిజన్ కోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్ ను గుర్తించడానికి, తదనుగుణంగా తగినంత సరఫరాను నిర్ధారించడానికి రాష్ట్రాలతో సమన్వయంతో.. విస్తృతమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ప్రధానికి తెలిపారు. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి ఇంకా.. సరఫరాను పెంచడానికి వివిధ రకాలైన వినూత్న మార్గాలను కూడా అన్వేషించాలని ప్రధాని ఆయా మంత్రిత్వ శాఖలను మోదీ ఇవాళ కోరారు. ఇక రేపు కూడా మరోమారు కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు మోదీ.
Tomorrow, will be chairing high-level meetings to review the prevailing COVID-19 situation. Due to that, I would not be going to West Bengal.
— Narendra Modi (@narendramodi) April 22, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: కోవిడ్ ఎఫెక్ట్, ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు ? పీఎం స్కాట్ మారిసన్