బియర్ గ్రిల్స్..ఈ పేరు గుర్తుపట్టారా..? డిస్కవరీ ఛానల్ లో వచ్చే ఫేమస్ అడ్వంచర్ ప్రోగ్రామ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో హోస్ట్..పూర్తి పేరు ఎడ్వర్డ్ మైఖేల్ గ్రిల్స్. అడవుల్లో గ్రిల్స్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ టూర్ చేశారు. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా ఇప్పటికే అన్ని ఛానెళ్లు ప్రసారం చేశారు. ఆ పూర్తి వీడియో ఈ నెల 12న రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానల్ లో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రధాని పర్యటనకు సంబంధించి తాజాగా మరో ట్వీట్ చేశారు గ్రిల్స్. తీవ్ర సంక్షోభంలో కూడా ఎంతో ప్రశాంతంగా ఉండగల మహోన్నత వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధానితో కలిసి గ్రిల్స్ చేసిన ప్రయాణం ప్రొమో ఇప్పటికే రేటింగ్ లో దూసుకుపోతోంది. అందులో ప్రధాని మోదీ వేటగాళ్లు వాడే బరిసెలను చేతబట్టి కనిపించడంతో ఈ షోపై అందరిలో ఆస్తకి నెలకొంది. ఉత్తరాఖండ్ అడవుల్లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో ఈ వీడియో షూట్ చేసినట్లు బేర్ గ్రిల్ ట్వీట్టర్ ద్వారా తెలిపాడు.
ప్రధాని ప్రయాణించిన ఆ అడవి పెద్దపులులకు నిలయం. దాదాపు 520 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంతే కాదు..క్రూరమృగాలకు కావాల్సిన ఆహారం కూడా ఇక్కడే ఎక్కువగా దొరుకుతుంది.. అటువంటి భయానక అడవిలోనే మేము ఆఫ్ ట్రాక్ చేశామని, అయిన్నప్పటికీ మోదీ ముఖంలో ఏ మాత్రం కంగారు, కలవరం లేకుండా నిబ్బరంగా ఉన్నారని గిల్స్ చెప్పారు. ఉప్పెన తలపై ఉన్న ప్రధానిలో చెక్కుచెదరని మనోధైర్యం కనిపించిందని ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో గ్రిల్ చెప్పుకొచ్చారు. అటువంటి ప్రధాని సాహాస యాత్రను పూర్తిగా చూడాలంటే..మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే…