గురునానక్ జయంతి వేడుకల్లో ప్రధాన మోదీ.. విదేశాల్లో స్థిరపడ్డ వారికి సువర్ణావకాశం..

|

Nov 08, 2022 | 12:26 PM

సిక్కుల కుటుంబీకులు ఉపాధికోసం, వ్యాపార కార్యకలాపాలకోసం పొరుగుదేశాలకెళ్లి అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతుండటం బాధాకరమన్నారు. పొరుగుదేశాల్లో ఇబ్బందులుపడుతున్నవారు భారతదేశం తిరిగొస్తే ..

గురునానక్ జయంతి వేడుకల్లో ప్రధాన మోదీ..  విదేశాల్లో స్థిరపడ్డ వారికి సువర్ణావకాశం..
Guru Nanak Jayanti
Follow us on

గురునానక్ జయంతి సందర్భంగా గురునానక్ 553వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గురునానక్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మైనారిటీల జాతీయ కమిషన్ చైర్‌పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్‌పురా నివాసాన్ని ప్రధాని సందర్శించారు. ప్రధాని మోదీ గురునానక్ దేవ్‌కు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు.. సిక్కు గురువుల బోధనలు, గురునానక్ జీవన విధానం ప్రపంచానికి సన్మార్గం చూపించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురునానక్ దేవ్ ఆలోచనల స్ఫూర్తితో దేశం 130 కోట్ల మంది భారతీయుల సంక్షేమ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని మోదీ అన్నారు. సిక్కుల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భరోసా ఇచ్చారు. సిక్కుల కుటుంబీకులు ఉపాధికోసం, వ్యాపార కార్యకలాపాలకోసం పొరుగుదేశాలకెళ్లి అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతుండటం బాధాకరమన్నారు. పొరుగుదేశాల్లో ఇబ్బందులుపడుతున్నవారు భారతదేశం తిరిగొస్తే భారతీయ పౌరసత్వం ఇస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు, మంగళవారం సాయంత్రం 8 గంటలకు ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌ 95లో శ్రీ గురునానక్ దేవ్ జీ 553వ జయంతి వేడుకలు జరుగుతాయని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొని, సిక్కు మత ప్రబోధకుడు గురునానక్‌కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని ప్రకటించింది. అనంతరం సిక్కులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని పీఎంవో ప్రకటించింది.

ఇక, కార్తీక మాసంలో పౌర్ణమి రోజున గురునానక్ జయంతి జరుపుకుంటారు. సిక్కుల మొదటి గురువు గురునానక్ సిక్కు మతానికి పునాది వేసిన వ్యక్తి.. కాబట్టి గురునానక్ జయంతిని ఉత్సాహంతో జరుపుకుంటారు.ఈ జయంతిని ప్రకాశ పర్వం, గురుపర్బ్ అని కూడా అంటారు. ఈరోజున సిక్కులు తమ మత గ్రంథం.. గురు గ్రంథ్ సాహిబ్‌ను నిరంతరం పారాయణం చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి