ప్రధాని మోదీ(PM Modi) కర్నాటక పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు మోదీ. బెంగళూర్, మైసూర్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని. దేశంలో హాట్‌టాపిక్‌గా మారిన అగ్నిపథ్ పాలసీపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. సంస్కరణలు తొలుత ఎవరికి నచ్చవన్నారు . దీర్ఘకాలంలో అవే సంస్కరణలతో జాతి నిర్మాణం జరుగుతుందన్నారు. రక్షణరంగంలో యువతకు ఉపాధి అవకాశాలు గతంతో పోలిస్తే చాలా మెరుగయ్యాయని స్పష్టం చేశారు.
ఎన్నో నిర్ణయాలు , ఎన్నో సంస్కరణలు తాత్కాలికంగా ఎవరికి నచ్చవు. కాలం గడిచిన కొద్దీ అవే సంస్కరణలు దేశానికి ఎంతో ఉపయోగపడుతాయి. సంస్కరణల బాట తోనే మనం అభివృద్దిలో దూసుకెళ్లే అవకాశం ఉంటుంది . స్పేస్ , డిఫెన్స్ రంగాలను యువత కోసం తెరిచాం. దశాబ్దాల పాటు ఈ రంగాల్లో ప్రభుత్వానిదే ఆధిపత్యం. డ్రోన్ల నుంచి విమానరంగం వరకు యువతకు ప్రోత్సాహం ఇస్తున్నాం.
బెంగళూర్‌లో రూ.28 వేల కోట్ల మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. బెంగళూర్ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని ప్రశంసించారు మోదీ. ప్రభుత్వ – ప్రైవేట్ భాగస్వామ్యంతో వేగంగా అభివృద్ది సాధ్యమని , దీనికి బెంగళూర్ నగరమే నిదర్శనమని అన్నారు . గత 8 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్లిందన్నారు.
మైసూర్‌లో కూడా పలు అభివృద్ద కార్యక్రమాలను ప్రారంభించారు మోదీ. నాగనహళ్లి ఏసీ టర్మినల్‌ను ప్రారంభించారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ సంస్థలను కూడా ప్రారభించారు. ఈ కార్యక్రమానికి సీఎం బస్వరాజ్ బొమ్మై , మాండ్యా ఎంపీ సుమలత హాజరయ్యారు.
Delighted to be in Bengaluru. Speaking at a public meeting. https://t.co/epNMla6flf
— Narendra Modi (@narendramodi) June 20, 2022
మంగళవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మైసూర్ ప్యాలెస్‌లో జరిగే వేడుకలకు మోదీ హాజరవుతారు. కరోనా కారణంగా రెండేళ్ల తరువాత యోగాడేను నిర్వహిస్తున్నారు. 15 వేలమందితో కలిసి యోగా చేస్తారు మోదీ.