PM Modi: బ్రిక్స్ వేదికపై జారిపడ్డ జాతీయ జెండా.. ప్రధాని మోదీ చేసిన పనికి ప్రశంసలు

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు బ్రిక్స్ సభ్య దేశాలకు సంబంధించిన అధినేతలు వచ్చారు. ఇండియా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జోహన్నెస్‌బర్గ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీతో ఫోటో దిగడానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఆసక్తి చూపాడు. ఇరునేతలు కలిసి... ఫోటో దిగాడానికి బ్రిక్స్ వేదికపైకి వచ్చారు.

PM Modi: బ్రిక్స్ వేదికపై జారిపడ్డ జాతీయ జెండా.. ప్రధాని మోదీ చేసిన పనికి ప్రశంసలు
Pm Modi

Updated on: Aug 24, 2023 | 8:19 AM

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు బ్రిక్స్ సభ్య దేశాలకు సంబంధించిన అధినేతలు వచ్చారు. ఇండియా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జోహన్నెస్‌బర్గ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీతో ఫోటో దిగడానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఆసక్తి చూపాడు. ఇరునేతలు కలిసి… ఫోటో దిగాడానికి బ్రిక్స్ వేదికపైకి వచ్చారు. అయితే.. ఆ క్షణంలో ఆ వేదికపై పడి ఉన్నా భారత త్రివర్ణ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గమనించారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. వెంటనే అప్రమత్తమయ్యాడు. మరో అడుగు ముందుకు వేయకుండా.. జాతీయ జెండాను గౌరవంతో తీసుకుని తన జేబులో పెట్టుకున్నారు ప్రధాని. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ప్రధాని చేసిన పనికి చాలామంది నెటీజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా కింద పడి ఉన్న త్రివర్ణ పతాకాన్ని చూసి.. ఆ వెంటనే దాన్ని తీసుకొని చేతిలో పట్టుకున్నారు. అలా ఆయవ కూడా మన త్రివర్ణ పతాకాన్ని గౌరవించారు. ఆ తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌లతో ప్రధాని మోదీ ఫొటోలు తీసుకున్నారు. బుధవారం జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. మరో విషయం ఏంటంటే అంతకుముందు కూడా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో కలిసి ఆయన ద్వైపాక్షిక సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో అద్భుతమైన సమావేశం జరిగినట్లు పేర్కొన్నారు. భారతదేశం-దక్షిణాఫ్రికా సంబంధాలను మరింతగా బలోపేతం చేసేలా మేము అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. ముఖ్యంగా వాణిజ్యం, రక్షణ, పెట్టుబడి సంబంధాలపై చర్చించామని తెలిపారు. గ్లోబల్ సౌత్ వాయిస్‌ని బలోపేతం చేసేందుకు మేము కలిసి పని చేస్తూనే ఉంటాము. అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికాలోని చైనా రాయబారి చెన్ జియాడాంగ్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సదస్సులో భారత్‌, చైనా అగ్రనేతల మధ్య సమావేశం ఉండనుందని చెప్పారు. ఈ భేటీతో సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో.. భారతదేశం నుంచి విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా కూడా ఓ ప్రకటన చేశారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య సమావేశం ఉందబోతున్నట్టు తెలిపారు. అలాగే భారత్ సానుకూల ఆలోచనతో జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్తోందని, బ్రిక్స్ విస్తరణ కోసం ఆలోచనలు చేస్తోందని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.